ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లోని ఖతౌలి వద్ద ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పూరీ- హరిద్వార్- కళింగ ఉత్కళ్ ఎక్స్ ప్రెస్ రైలులోని 10 బోగీలు పట్టాలు తప్పాయి. పూరీ నుంచి హరిద్వార్ వెళుతుండగా ఈ ప్రమాదం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు బోగీలు ఒకదానిపై ఒకటి దూసుకెళ్లాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. పట్టాల పక్కనే ఉన్న ఇళ్లల్లోకి రైలు బోగీలు దూసుకెళ్లడంతో ఇంట్లో ఉన్నవారికి కూడా గాయాలయ్యాయి. పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు.
ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటనా స్థలికి 30 పైగా అంబులెన్సులు చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు ఆసుపత్రికి తరలిస్తున్నాయి.ఘటనా స్థలికి రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా వెళుతున్నారని సురేశ్ ప్రభు తెలిపారు. సహాయ కార్యక్రమాలను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, సహాయ చర్యలను వేగవంతం చేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్ ను ఆదేశించామన్నారు. రైలు ప్రమాద ఘటనపై తాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడానని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.3.5లక్షల చొప్పున, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున అందిస్తామని రైల్వే వాఖ ప్రకటించింది.
కాగా, ఈ ఘటనపై స్పందించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ రైలు ప్రమాద ఘటన తనను ఎంతగానో కలచివేసిందని ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రైల్వే మంత్రిత్వ శాఖ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. రైలు ప్రమాద ఘటన దురదృష్టకరమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రైలు ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వారికి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.