ప‌వ‌న్ ఇంట్లో ట్వీట్లు ఆపు. రాజ‌ధానిలో ఫైట్ చేయి

Update: 2015-08-21 13:55 GMT
చానాళ్ల‌కు హ‌నుమంత‌న్న‌..అదేనండి మ‌న సీనియ‌ర్ కాంగ్రెస్ నేత వి.హ‌నుమంత‌రావు మాట్లాడారు. ఇటీవ‌ల పెద్ద‌గా మీడియా ముందుకు ఎప్పుడో కాని రాని ఆయ‌న ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ కు ఓ స‌ల‌హా ఇచ్చారు. ఏపీ రాజ‌ధాని రైతుల కోసం పోరాడుతున్న ప‌వ‌న్ ఇంట్లో కూర్చుని ట్వీట్లు చేయ‌డం కాద‌ని...ఏపీ రాజ‌ధాని వెళ్లి అక్క‌డ రైతుల‌తో క‌లిసి వారి కోసం పోరాటం చేయాల‌ని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు.

ఏపీ రాజ‌ధాని కోసం రైతుల నుంచి బ‌ల‌వంతంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం భూసేక‌ర‌ణ చేస్తోంద‌ని...అక్క‌డ రైతుల‌ను ఆదుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆయ‌న చెప్పారు. మ‌రి ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ హ‌నుమంత‌న్న సూచ‌న స్వీక‌రించి ట్వీట్లు ఇవ్వ‌డం మానేసి రైతుల కోసం ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌కు ఎప్పుడు దిగుతారో చూడాలి.

ఇదే విష‌యంపై ఏపీ మంత్రి నారాయ‌ణ మాట్లాడుతూ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్య‌టించి మిగిలిన రైతులు కూడా భూమి ఇచ్చేందుకు కృషి చేయాల‌ని సూచించారు. 95 శాతం మంది రైతులు భూమి ఇచ్చార‌ని..మిగిలిన 5 గురు అంగీక‌రించ‌క‌పోతే రాజ‌ధాని నిర్మాణం ఇబ్బంది అవుతుంద‌నివారు కూడా త‌మ భూములు త‌ప్ప‌క ఇవ్వాల‌ని ఆయ‌న సూచించారు.

ప‌వ‌న్ రాజ‌ధానిలో ప‌ర్య‌టించి ఏపీ మంత్రులు కోరుతున్న‌ట్టు మిగిలిన రైతులు కూడా భూమి ఇచ్చేలా ఒప్పిస్తారా..లేదా వారి కోసం చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఢీ కొడ‌తారా అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News