రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ హనుమంతరావు తాజాగా పోలీసుల్ని ఆశ్రయించారు. తనను ఒక మహిళ బెదిరివస్తోందంటూ కంప్లైంట్ ఇచ్చారు. సంజనా చౌదరి అనే మహిళ తన ఫోన్ కు పదే పదే ఫోన్ చేసి బెదిరిస్తోందని వాపోయారు. ఇంతకీ సదరు మహిళ ఎందుకు వార్నింగ్ ఇస్తోంది? ఏ ఇష్యూ మీద వార్నింగ్ ఇస్తోంది? అన్న ప్రశ్నలు వేస్తే.. ఆసక్తికర సమాధానాలు రావటం గమనార్హం.
మాజీ ప్రధాని.. స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీని చంపించింది కాంగ్రెస్ అధినేత్రి కమ్ కోడలు సోనియాగాంధీ.. మనమరాలు ప్రియాంక గాంధీ అని ఆరోపిస్తోందని.. అలాంటి వ్యక్తులకు మీరెందుకు మద్దతు పలుకుతున్నారంటూ తనతో సదరు మహిళ వాదనకు దిగినట్లుగా వీహెచ్ చెబుతున్నారు. ఇలాంటివి నిజం కావని తాను చెప్పే ప్రయత్నం చేస్తే.. సదరు మహిళ తనతో వాదనకు దిగిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో.. తాను ఫోన్ కట్ చేస్తే.. మళ్లీ ఫోన్ చేసి హెచ్చరిస్తోందని చెబుతున్నారు. ఈ ఉదంతంపై విచారణ జరిపి.. సదరు మహిళపై చర్యలు తీసుకోవాలంటూ.. సదరు మహిళకు సంబంధించిన ఫోన్ నెంబరును తన ఫిర్యాదులో వీహెచ్ పేర్కొన్నారు. అయినా.. జమానాలో జరిగిపోయిన వాటికి సంబంధించి.. ఏ మాత్రం చర్చకు రాని అంశాలపై లేనిపోని అనుమానాలు రేకెత్తేలా.. పిచ్చితనంతో చేసిన వ్యాఖ్యలుగా పలువురు పేర్కొంటున్నారు. అయినా.. దేశంలో ఇంతమంది కాంగ్రెస్ నేతలు ఉంటే.. వారందరిని వదిలేసి.. హనుమంతన్నకే ఫోన్ చేయుడేంది..?