కరోనా మహమ్మారి ఏడాది నుంచి కోరలు చాస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరణాలు సంభవిస్తున్నాయి. అయితే వైరస్ నియంత్రణకు ఇప్పటికే పలు కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా వివధ రకాల టీకాలను ప్రయోగిస్తున్నారు. అయితే ఈ మహమ్మారికి ఎదుర్కొవడానికి పూర్తి స్థాయి వ్యాక్సిన్ ఇప్పటికీ రాలేదని నిపుణులు అంటున్నారు.
వైరస్ కారణంగా గతేడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మంది మృత్యువాత పడ్డారు. ఆఫ్రికాలో ఇలాంటి విషాధ ఘటనలు రోజూ జరుగుతాయి. ఆ దేశంలో మలేరియా కారణంగా ఏటా 500 మంది ఆస్పత్రుల పాలవుతారు. 1 మిలియన్ మందికి పైగా ప్రాణాలు కోల్పోతారు. వారిలో పిల్లలు, యువత ఉంటారని అక్కడి అధికారులు చెబుతారు. ఆ మలేరియాని అరికట్టగల సమర్థవంతమైన వ్యాక్సిన్ ఇప్పటికీ కనుగొనలేదు. ఈ వ్యాధి ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో సంక్రమిస్తుంది.
యాభై ఏళ్లుగా మలేరియా ఆఫ్రికాను వణికిస్తోంది. దీనిపై నిర్వహించిన పరిశోధనల్లో వైద్యులు ఇటీవలె సక్సెస్ అయ్యారు. కొన్నేళ్లుగా బుర్కినా ఫాసోలో అధ్యయనాలు కొనసాగుతున్నాయి. వ్యాధి మూలాన్ని ఎదుర్కొవడంలో వైద్యులు సఫలం అయ్యారు. ఈ ప్రక్రియలో 5 నెలల నుంచి 17 నెలల వయస్సున్న పిల్లలను మూడు సమూహాలుగా విభజించి పరిశీలించారు. వారికి వేర్వేరు మొత్తాల్లో టీకా ఇచ్చినట్లు ఆ దేశ వైద్యులు తెలిపారు.
ఆ సమూహాల్లో 77 శాతం సక్సెస్ రేటు వచ్చిందని చెప్పారు. టీకా ఇవ్వని మూడో సమూహంలో ఎలాంటి మార్పులు జరగలేదని గుర్తించారు. ఈ ప్రాణాంతక వ్యాధిని సమూలంగా నివారించడానికి టీకా కనిపెట్టినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. కాగా యాభై ఏళ్ల నాటి వ్యాధికి టీకా లభించిందని... మరి కొవిడ్ కు సమర్థవంతమైన వ్యాక్సిన్ సంగతేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అతి త్వరలోనే కరోనాకు సమర్థవంతమైన టీకా వస్తుందని వారు తెలిపారు.