దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. సరైన మందులు మార్కెట్లో లేవు. వ్యాక్సిన్ల కొరత వెంటాడుతోంది. టీకా డ్రైవ్ దేశంలో నత్తనడకన సాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి వ్యాక్సిన్ల కొరత వెంటాడుతోంది. దేశంలో ఇప్పుడిప్పుడే వేగవంతం అయ్యింది. తాజాగా మల్టీ-స్టార్ హోటళ్ళు కరోనా వ్యాక్సిన్ల పేరుతో డబ్బు సంపాదించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. పలు ఆస్పత్రులు బహుళ ప్యాకేజీలను అందిస్తూ స్టార్ హోటళ్లతో డీల్ కుదుర్చుకొని ఈ తతంగం నడిపిస్తున్నట్టు సమాచారం. టీకాలు వేసే వ్యక్తులు హోటళ్లతో చేతులు కలిపినట్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి వచ్చింది. అటువంటి ప్యాకేజీలపై.. వాటిని అందించే సంస్థలపై చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వం రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.
దీనికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్ని తాజాగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. "కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని హోటళ్ళ సహకారంతో కోవిడ్ టీకా కోసం ప్యాకేజీలను ఇస్తున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. ఇది నేషనల్ కోవిడ్ టీకా కార్యక్రమానికి జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధం" అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
- కోవిడ్ టీకా మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ టీకాలు వేయడానికి నలుగురికి మాత్రమే హక్కు ఉందని కేంద్రం తెలిపింది.
1. ప్రభుత్వ కోవిడ్ టీకా కేంద్రం
2. ప్రైవేట్ కోవిడ్ టీకా కేంద్రం ప్రైవేట్ ఆసుపత్రి నడిపే టీకా కేంద్రం
3. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద నిర్వహించాల్సిన ప్రభుత్వ కార్యాలయాల వద్ద మరియు ప్రైవేట్ సంస్థల వద్ద ప్రైవేటు ఆసుపత్రుల వద్ద కోవిడ్ టీకా కేంద్రాలు.
4. గ్రూప్ హౌసింగ్ సొసైటీలలో వృద్ధులు మరియు విభిన్న సామర్థ్యం ఉన్నవారికి ఇంటి కోవిడ్ టీకా కేంద్రం సమీపంలో వేయవచ్చు. ఆర్‌డబ్ల్యుఎ కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లు. తాత్కాలిక ప్రాతిపదికన పంచాయతీ భవన్, పాఠశాలలు / కళాశాలలు, వృద్ధాప్య గృహాలు మొదలైన వాటిల్లో టీకాలు వేయవచ్చు.
"ఇది కాకుండా జాతీయ కోవిడ్ టీకా కార్యక్రమం కింద టీకాలు వేయడానికి ఇతర మార్గాలు లేవు. అందువల్ల స్టార్ హోటళ్లలో టీకాలు వేయడం మార్గదర్శకాలకు విరుద్ధం. వెంటనే వాటిని ఆపాలి. అటువంటి సంస్థలపై అవసరమైన చట్టపరమైన.. పరిపాలనా చర్యలను ప్రారంభించాలి. నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం నేషనల్ కోవిడ్ టీకా డ్రైవ్ నిర్వహించబడుతుందని.. మీరు పర్యవేక్షించాలని రాష్ట్రాలను కోరుతూ” కేంద్ర కార్యదర్శి లేఖ రాశారు.