ఆ ఇద్దరి పేర్లూ ప్రపంచంలో అనేక సార్లు చర్చకు వస్తాయి. అంతర్జాతీయ రాజకీయాల మీద ఏ కాస్తా అవగాహన ఉన్నా ఈ ఇద్దరి గురించి తలచుకోని వారు ఉండరు. వారే చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్. రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ ఇద్దరూ రెండు పెద్ద సంక్షోభాల వెనక ఉన్నారు అని అంటారు. చైనా నుంచి కరోనా మహమ్మరిని వదిలి ప్రపంచాన్ని ఇబ్బందులలో నెట్టడానికి జిన్ పింగ్ చూశారని ఒక ప్రచారం 2019 నుంచి సాగుతూ వస్తోంది. వూహాన్ ల్యాబుల్లో కరోనా తయారైందని, బయో వార్ కి తెర తీయడానికే దాన్ని అలా రెడీ చేశారని కూడా అనుమానించారు.
అదేంతవరకూ నిజమో తెలియదు కానీ ఈ రోజుకీ కరొనా పుట్టుక మాత్రం ఎవరూ కనుగొనలేకపోయారు. ఆ సంగతి అలా ఉంచితే పుతిన్ ఏమీ తక్కువ తినలేదు కదా. ఉక్రెయిన్ మీద పడి యుద్ధానికి తెర లేపాడు. ఆ విధంగా పుతిన్ ప్రపంచాన్ని మరో సంక్షోభంలోకి నెట్టారని అంతా అంటారు. చమురు ధరలు పెరిగి యుద్ధం వల్ల అన్ని రకాలుగా ఆర్ధిక సమస్యలు తలెత్తి ఈ రోజు ప్రపంచం విలవిలలాడుతోంది
అంటే కరోనాతో ప్రపంచానికి సవాల్ చైనా విసిరింది అన్న ఆరోపణలు ఒక వైపు ఉంటే పుతిన్ పుణ్యమాని ఒక దశలో మూడవ ప్రపంచ యుద్ధానికే తెర తీసిన పరిస్థితి ఉందని కూడా అంతా అంటున్న నేపధ్యం ఉంది. ఇంతే కాదు ఇద్దరూ మంచి మిత్రులు, రెండు దేశాలూ కూడా సన్నిహితంగా ఉంటాయి. ఇద్దరికీ అభద్రతాభావం ఎక్కువ. దాంతో ఇద్దరూ దురాక్రమణ సూత్రాన్నే గట్టిగా నమ్ముకున్నారు అని కూడా చెబుతారు.
ఈ మధ్యన భారత్ సరిహద్దుల్లోకి చొచ్చుకువస్తూ చైనా సాగిస్తున్న దుర్నీతి కళ్ళ ఎదుట ఉండనే ఉంది. ఇక ఉక్రెయిన్ తో సమరాన్ని మొదలుపెట్టి ఫిన్ లాండ్, స్వీడన్ లాంటి దేశాల మీదకు కూడా దండెత్తాలన్నది పుతిన్ మాస్టర్ ప్లాన్ అని అంటారు. సరే ఇవన్నీ ఇలా ఉంటే చిత్రంగా ఈ ఇద్దరు విశ్వ అధినేతలూ అనారోగ్యంతో బాధలు పడుతున్నారని ప్రచారం సాగుతోంది.
ముందుగా పుతిన్ విషయానికి వస్తే పుతిన్ తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని ఆయన బ్లడ్ క్యాన్సర్ తో సీరియస్ గా ఉన్నాడని తాజాగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ పుతిన్ కి నయం కానీ వ్యాధిగానే ఇది ఉందని అంటున్నారు. ఆ మధ్య పుతిన్ కి కేన్సర్ చికిత్సలో భాగంగా ఆయన వెన్నుకు మేజర్ శస్త్రచికిత్స చేశారని ఊహాగానాలు వినిపించాయి.
ఇక మరో విషయం ఏంటి అంటే ఉక్రెయిన్ యుద్ధానికి ముందే పుతిన్ కి ఈ ఆపరేషన్ జరిగిందట. అయినా ఇప్పటీకీ పుతిన్ కోలుకోవడం లేదని ఇక ఆయన బతకడం కష్టమేనని అంటున్నారు. మొత్తానికి పుతిన్ పరిస్థితి మాత్రం ఈ రోజు వరకూ చూస్తే బాగా ఇబ్బందికరమే అంటున్నారుట.
ఇక చైనా అధ్యక్షుడి విషయానికి వస్తే జిన్ పింగ్ కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారని అంటున్నారు. జిన్ పింగ్ మెదడుకు సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు. 2019లోనే జిన్ పింగ్ కు సెరిబ్రల్ అనూరిజం అనే మెదడుకు సంబంధించిన వ్యాధి సోకి ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే మెదడులోని ధమని అసాధారణంగా స్పందిస్తుందట. దాని ఫలితంగా రక్తనాళాల గోడల లోపలి పొర బలహీనపడి మెదడులో రక్తం గడ్డకట్టుకుపోతుందని వైద్య వర్గాలు చెబుతున్నారు. దీంతో మెదడులోని రక్తనాళాలు ఏ క్షణమైనా పగిలిపోయి రక్తస్రావం అవుతుందని, ఈ వ్యాధి సోకిన వారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కోమాలోకి వెళ్లిపోవడమో.లేక క్షణాలలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని అంటున్నారు. ఇక జిన్ పింగ్ అయితే చాలా కాలంగా చైనా సంప్రదాయ చికిత్స తీసుకుంటున్నట్టుగా చెబుతున్నారు.
మొత్తానికి చూస్తే ఈ ఇద్దరు అగ్ర నాయకుల ఆరోగ్యం మాత్రం ఇబ్బందుల్లో పడింది అని అంతర్జాతీయ మీడియా వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరికీ ఎన్నో విషయల్లో పోలికలు ఉన్నాయి. ఇద్దరూ అమెరికాకు వ్యతిరేకులు. ఇద్దరూ తమ సొంత అధిపత్యం, దేశ విస్తరణకు ఎక్కువగా పాటుపడతారు. నియంత పాలనను సాగించే ఈ ఇద్దరికీ సొంత దేశాలలో అభిమానులు ఉన్నారు. అలాగే అసలు పడనివారూ ఉన్నారు.
ఏది ఏమైనా ఒకే సమయంలో ఇద్దరు ప్రపంచ అధినేతలు ఇలా వ్యాధుల బారిన పడ్డారు అని వార్తలు రావడం మాత్రం విశేషం. ఈ ఇద్దరూ కనుక ఇలాంటి అనారోగ్య సమస్యలతో లేకపోతే ఈ పాటికి ఏకంగా ప్రపంచం తలరాతనే మార్చేయాలనుకున్న ఘనాపాఠీలు. మరి వారి విషయంలో వార్తలు ఎంతవరకూ నిజమో కాదో చూడాలి. నిజమైతే మాత్రం ఇది విధి వైపరిత్యం అని కూడా భావించాలి.