ఆ జంపింగులు.. కింగుల‌య్యేదెప్పుడు స‌ర్‌?!

Update: 2022-12-15 09:30 GMT
ఒక పార్టీ నుంచి మ‌రొక పార్టీలోకి  మారే నాయ‌కుల‌కు ముందుండే ల‌క్ష్యం 'మ‌రింత మెరుగైన రాజ‌కీయ‌మే'. ఇది స‌హ‌జంగా దేశంలోని అన్ని పార్టీల్లోనూ క‌నిపిస్తున్న వాస్త‌వం. ఒక పార్టీలో ఉన్న‌వారు.. ప‌ద‌వులు ఆశించో.. వ్యాపార ల‌బ్ధి కోస‌మో.. వార‌సుల రాజ‌కీయ‌మో.. మ‌రేదో కార‌ణంగానో వారు ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి జంప్ చేస్తుంటారు. స‌క్సెస్ కూడా కొడుతున్నారు.

కానీ, ఏపీలో మాత్రం జంపింగుల‌కు అంత సీన్ క‌నిపించ‌డం లేదు. పార్టీ ఏదైనా జంప్ చేస్తున్న‌వారిని ప్ర‌జ‌లు ఆద‌రించ‌డం మానేశారా? అనే చ‌ర్చ సాగుతోంది. గ‌త 2014 నుంచి 2019 వ‌ర‌కు జ‌రిగిన రాజ‌కీయా ల‌ను తీసుకుంటే.. ఇదే క‌నిపిస్తోంది. ఒక‌రిద్ద‌రు త‌ప్ప మిగిలిన వారంతా విఫ‌ల‌మ‌య్యార‌నే చెప్పాలి. నిజానికి జంపింగులు.. ఇప్పుడు కొత్త‌కాదు. అయినా.. ఎందుకో ఇప్పుడు బెడిసికొడుతోంది.

గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వీరిలో కేవ‌లం ఒక్క‌రిని మాత్ర‌మే ప్ర‌జ‌లు ఆద‌రించారు. అద్దంకి ఎమ్మెల్యేగా గొట్టిపాటి ర‌విమాత్ర‌మే ఎన్నిక‌య్యారు.

మిగిలిన వారంతా.. క‌నుమ‌రుగైపోయారు. ప్ర‌స్తుతం వారికి టికెట్‌లు ఇచ్చే ప‌రిస్థితి కూడా లేద‌ని తెలుస్తోంది. అంతేకాదు.. వారసలు జ‌నాల్లోకి కూడా రావ‌డం లేదు.

ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న న‌లుగురు టీడీపీ ఎమ్మెల్యేలు.. వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. ఇప్పుడు వీరి ప‌రిస్థితి కూడా అదేవిధంగా ఉంద‌ని తెలుస్తోంది. వీరు కూడా జ‌నాల్లోకి రాలేక పోతున్నారు. ఇటీవ‌ల జ‌నాల్లోకి వ‌చ్చి గ‌డ‌ప‌గ‌డ‌ప కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన గ‌న్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌లు ఎదుర‌య్యాయి.

''మీరెందుకు పార్టీ మారారు' అని ప్ర‌శ్నించ‌డంతో ఆయ‌న న‌వ్వుతూ ముందుకు సాగిపోయారు త‌ప్ప‌.. స‌మాధానం చెప్ప‌లేక పోయారు. సో.. ఇదే ప‌రిస్థితి మిగిలిన వారికీ ఎదుర‌వుతోంది. పార్టీలోనూ అసంతృప్తి సెగ‌లు పెరుగుతున్నాయి. ఇలా.. ఏపీలో జంపింగుల‌ను ప్ర‌జ‌లు స‌హించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో జంపింగులు కింగులు కావ‌డం చాలా క‌ష్ట‌మే గురూ అంటున్నారు ప‌రిశీల‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News