వంగవీటి రాధాకృష్ణ. బెజవాడ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. వంగవీటి రంగా తనయుడిగా ఆయనకు ప్రజల్లో ఎంతోకొంత గుర్తింపు ఉంది. అలాంటి రాధా ఇటీవల వైఎస్సార్ సీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా వైసీపీకి అంటీముట్టనట్టుగా వ్యవహరించిన రాధాకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ఈ ఎపిసోడ్ కు సంబంధించిన సస్పెన్స్ వీడింది. బెజవాడ సెంట్రల్ సీటును ఆశించి భంగపడిన రాధా వైసీపీని వీడారు. అయితే.. రాధా పార్టీలోనే కొనసాగేలా చేసేందుకు వైసీపీ చివరి వరకూ ప్రయత్నించింది. సీనియర్ నేత బొత్స - యలమంచిలి రవి మంతనాలు సాగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకు దాదాపు ఖాయం కావడం, సెంట్రల్ సీటు కాకుండా వేరే స్థానం నుంచి పోటీ చేయాలని వైసీపీ కోరడం.. అందుకు రాధా నో చెప్పడంతో ఉత్కంఠకు తెరపడింది. అయితే.. వైసీపీని వీడిన వంగవీటి రాధాకు టీడీపీలో కూడా ప్రస్తుతం టికెట్ దక్కే అవకాశాలు ఏ కోశానా కనిపించడం లేదు. ఇన్నాళ్లూ తన తండ్రి చావుకు కారణమని పదేపదే ఏ కుటుంబం పైనైతే రాధా ఆరోపణలు చేశారో.. నేడు అదే కుటుంబం ఉన్న పార్టీలో చేరాల్సిన పరిస్థితి.
వంగవీటి రాధా ఆశించిన బెజవాడ సెంట్రల్ టికెట్ టీడీపీలో కూడా దక్కే అవకాశం లేదు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మళ్లీ పోటీ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సామాజికవర్గ పరంగా చూసినా ఆయనకే టికెట్ దక్కే అవకాశం మెండుగా ఉంది. ఇక కృష్ణా జిల్లాలోని ఇతర స్థానాల్లో కూడా ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు - ఆశావహులైన పలువురు టీడీపీ నేతలు కూడా కర్చీఫ్ లు వేసుకుని అధినేత నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకు టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశం దాదాపుగా లేనట్టుగానే స్పష్టమవుతోంది. అయితే.. పార్టీలో గుర్తింపుపరంగా చూసినా దేవినేని నెహ్రు కుమారుడు అవినాష్ కే ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్ష పదవి ఇటీవలే దేవినేని అవినాష్ ను వరించింది. దీంతో ఆయన పార్టీపరంగా మరింత దూకుడు పెంచారు. ఇలాంటి పరిస్థితుల్లో వంగవీటి రాధా టీడీపీలో చేరితే తగిన ప్రాధాన్యం దక్కుతుందా లేదా అనే ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం లేదు.
వంగవీటి రాధా పార్టీలో చేరితే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఒకవేళ అదేగానీ నిజమైతే ఎమ్మెల్సీ పదవి కోసం రాధా పార్టీ మారడం అవసరమా అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మంత్రి పదవి ఇస్తారో.. లేదో సందేహమే. టీడీపీ మళ్లీ గెలిచి వంగవీటి రాధాకు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నా దేవినేని కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఎమ్మెల్యే బోండా ఉమా కూడా తనకు మంత్రి పదవి దక్కలేదనే కారణంగా గతంలోనే పార్టీపై ఆరోపణలు చేసి.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ఇన్ని అవరోధాలు దాటి వంగవీటి రాధాకు మంత్రి పదవి దక్కుతుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
వైసీపీలో ఉంటే ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యే పదవి దక్కేదని - టీడీపీలో చేరితే వంగవీటి రంగా నిజమైన అభిమానుల నుంచి కూడా రాధా వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా వైసీపీని వీడిన రాధా టీడీపీలో చేరే విషయంలో డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఇంత చేసి ఎమ్మెల్సీ పదవి తీసుకుంటే జనంలో చులకన అవుతానేమోనన్న భావన కూడా రాధాను వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరాలన్న ఆలోచనపై పునరాలోచిస్తారో లేక పసుపు కండువా భుజాన వేసుకుంటారోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.