ఏ పార్టీలోకి వెళితే ఆ పార్టీ ఓడిపోయిందనే అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు వంగవీటి రాధ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ విభాగం అధ్యక్షుడు అనే హోదాతో వంగవీటి రాధా ఒక వెలుగు వెలిగేవాడు ఈ పరిస్థితుల్లో. అయితే ఆయన తనకు కోరిన టికెట్ దక్కలేదు అనే భావనతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటం పెద్ద పొరపాటుగా పరిణమించింది. అసంతృప్తితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిన వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో కూడా ఏం సాధించుకోలేకపోయారు.
కోరిన ఎమ్మెల్యే టికెట్ ను పొందలేదు. లేదా ఏ ఎమ్మెల్సీ పదవినో పొందలేదు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. తన తండ్రి దగ్గర ఒక చోటా అనుచరుడిగా పని చేసిన బోండా ఉమ పక్కన నిలబడి విజయవాడ సెంట్రల్ లో వంగవీటి రాధా ప్రచారం సాగింది. తెలుగుదేశం పార్టీ ప్రచార పర్వంలో ఆయనకు దక్కిన ప్రాధాన్యత అంతంత మాత్రమే.
ఆ విషయంలో పోలింగ్ కు ముందే చర్చలోకి వచ్చింది. ఆ క్రమంలో ఇప్పుడు వంగవీటి రాధా పరిస్థితి ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారింది. సెంట్రల్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసింది. తక్కువ మెజారిటీతోనే అయినా మల్లాది విష్ణు అక్కడ విజయం సాధించారు. మల్లాది విష్ణు విజయంతో అటు బోండా ఉమ పరువే కాదు.. వంగవీటి రాధా పరువు కూడా పోయింది.
2009 లో కాంగ్రెస్ పార్టీని వీడి వంగవీటి రాధా ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పట్లో ఆ పార్టీ చిత్తు అయ్యింది. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో ఆ పార్టీ ఓడిపోయింది. ఇక ఈ ఎన్నికలప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు వంగవీటి రాధా. ఇప్పుడు ఆ పార్టీ కూడా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా తదుపరి రాజకీయ పయనం ఎటో!