వంగవీటి రాధా రాజకీయాల్లో ఎప్పుడూ స్థిరంగా ఉన్నది లేదు. తరచుగా పార్టీలు మారడం ఆయనకు అలవాటే, కాంగ్రెస్ - ప్రజారాజ్యం - వైఎస్సార్ కాంగ్రెస్ - తెలుగుదేశం.. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలన్నీ రౌండ్ వేసేశాడు రాధా. ఈ ఏడాది ఆరంభం వరకు వైకాపాలో ఉన్న రాధా.. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత తెలుగుదేశం కోలుకోలేని పరిస్థితుల్లో ఉండటంతో ఆయన ఆలోచనలు మారిపోయాయి. ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడాయన చూపు జనసేనపై పడిందా? తాజా పరిణామాలు చూస్తే ఔననే అనిపిస్తోంది.
తాజాగా రాజమండ్రిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను వంగవీటి రాధా కలిశాడు. దీనికంటే ముందు ఆయన నాదెండ్ల మనోహర్‌తో రాధా భేటీ అయ్యాడు. ఎన్నికల్లో పరాభవం నుంచి కోలుకున్న జనసేన అధినేత ఏపీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. జనసేనలో కూడా ఉత్సాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వంగవీటి వారసుడు ఆ పార్టీ పట్ల ఆకర్షితుడవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విజయవాడలో నిర్వహించిన టీడీపీ జనరల్ బాడీ సమావేశానికి రాధా రాకపోవడంతో ఆయన ఆ పార్టీ నుంచి బయటికి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్‌తో భేటీతో ఈ ప్రచారం నిజమే అని అర్థమవుతోంది.