వీర‌మాచినేని కి అంత‌ర్జాతీయ అవార్డు..అంతేకాదు

Update: 2019-02-16 17:02 GMT
తన సొంత సమస్య కోసం పరిష్కారాలు వెదికి... సరికొత్త డైట్‌ సూత్రాన్ని కనిపెట్టిన వ్య‌క్తి వీరమాచినేని రామకృష్ణారావు. ఆహార విధానంలో కొద్దిమార్పులతో జీవనశైలి సంబంధిత వ్యాధులన్నీ తగ్గిపోతాయని చెబుతున్నారు. ఈ పద్ధతిలో పొద్దున్నే టిఫిన్‌ - మధ్యాహ్నం భోజనం - రాత్రి మళ్లీ భోజనం లేదా చపాతీలు తినడం కుదరదు. అలాగని నోరు కట్టేసుకోవాల్సిన పని లేదు. మాంసాహారం తినేయవచ్చు. మీగడ, నెయ్యి వాడొచ్చు. ఈ ‘హై ఫ్యాట్‌’ డైట్‌ను ఆర్నెళ్లపాటు అనుసరిస్తే.. కొద్దిపాటి నియంత్రణతో ఆరోగ్యంగా ఉండొచ్చునని రామకృష్ణారావు ప్ర‌క‌టించారు. వీఆర్కే డైట్ పేరుతో సుప‌రిచిత‌మైన ఈ డైట్‌ కు విశేష‌మైన ఆద‌ర‌ణ ద‌క్కింది. తాజాగా అంత‌ర్జాతీయ అవార్డు ద‌క్కింది.

చైనాకు చెందిన‌ ప్రపంచ ప్రఖ్యాత చాంక్జింగ్ హైజియా కాన్సర్ హాస్పిటల్ - ఇంటర్నేషనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఆంకో న్యూట్రీషియనిస్ట్’ అవార్డుతో స‌త్క‌రించింది. తాజాగా అందించిన అవార్డు గురించి చైనాలో రీసెర్చ్ డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ సంపత్ స్పందిస్తూ - ప్రపంచవ్యాప్తంగా ప్రతిపాదనలో ఉన్న వివిధ డైట్స్ పై పరిశోధన సాగుతుందని - అలా వీఆర్కే డైట్ పై కూడా పరిశోధన జరిగిందని తెలిపారు. కాన్సర్ బాధితులకు  వీ ఆర్కే డైట్‌ను అందించ‌గా - ప్రభావం పేషెంట్స్ మీద స్పష్టంగా కనిపించిందన్నారు. కీమో థెరపీని ఇమ్యునైజ్ చేసి - మరింత మెరుగు పరిచే గుణం వీఆర్కే డైట్ కు ఉంది అని గుర్తించారు. రెండు - మూడు నెలల నుంచి మంచి ఫలితాలు కనిపించాయ‌న్నారు. క్యాన్సర్ పేషెంట్లు కీమో థెరపీతో పాటు వీఆర్కే డైట్ ను తీసుకోవడం ద్వారా వారి జీవ‌న ప్ర‌మాణాలు పెరిగింద‌ని త‌మ అధ్యయన కేంద్రం ప‌రిశోధ‌న‌ల్లో స్ప‌ష్ట‌మైంద‌న్నారు.

ఆ ప‌రిశోధ‌ల‌న ఫ‌లితంగా వీర‌మాచినేనితో మ‌రింత క్రియాశీలంగా ప‌నిచేసేందుకు ముందుకు సాగుతున్న‌ట్లు తెలిపారు. చైనాలో పలువురు మంత్రులు - డాక్టర్లు - పరిశోధకులు వీరమాచనేనిని కలిసి రానున్న కాలంలో చైనాలో వీరమాచనేనితో పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించటం గురించి చ‌ర్చించామ‌ని డాక్ట‌ర్లు తెలిపారు. చాంక్జింగ్ హైజియా కాన్సర్  హాస్పిటల్ - ఇంటర్నేషనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ వీరమాచనేనితో కలిసి మరిన్ని పరిశోధనలు చేయటానికి సంసిద్ద‌త వ్య‌క్తం చేసింద‌న్నారు. దీనికి తోడుగా క్యాన్స‌ర్ బ్లాక్‌కు వీర‌మాచినేని పేరుపెట్ట‌డం గ‌ర్వ‌కార‌ణం అన్నారు.

Tags:    

Similar News