తెలంగాణ అసెంబ్లీ శనివారం హాట్ హాట్ గా సాగింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చాలానే చోటు చేసుకున్నాయి. ఇలాంటివి చాలానే ఉన్నా.. టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే (నిజామాబాద్ జిల్లా బాల్కొండ) వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం అందరిని ఆకర్షించేలా ఉన్నాయి. ఆయన చెప్పిన మాటల్లో రెండు అంశాలున్నాయి. అందులో ఒకటి.. కేసీఆర్ భవిష్యత్తులో ఏమవుతారన్నది ఒకటైతే.. మరొకటి.. తన పార్టీ సహచరులతో ఆయనేం చెబుతున్నారన్నది మరొక అంశం.
మొదట పొగడ్తలోకి వెళితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు బతుకుతారని.. దేశానికి నాయకత్వం వహిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక.. పార్టీ సహచరులతో కేసీఆర్ చెప్పే ఒక విషయాన్నిఆసెంబ్లీలో ప్రస్తావించారు. ‘‘ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. అదయ్యాక మంత్రి.. ముఖ్యమంత్రి.. ప్రధానమంత్రి.. రాష్ట్రపతి కావాలని కోరుకుంటాడు. కానీ.. సీఎం కేసీఆర్ గోదావరి బ్యారేజీలపై మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాక.. చాలా ప్రశాంతంగా ఉన్నారు. తెలంగాణ భూములకు నీరు పారించే వరకు భగవంతుడు తనను బతికిస్తే చాలు అని కేసీఆర్ అంటుంటారు. ఎలాంటి పదవులు ఆశించకుండా సాగునీటిని అందించాలని కేసీఆర్ తపన పడుతున్నారు. ఆయన తప్పకుండా నిండు నూరేళ్లు బతుకుతారు. దేశానికి నాయకత్వం వహిస్తారు’’ అని అధికారపక్ష నేతల మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేశారు.