ఒక్కో మ‌హిళ 6 మంది పిల్ల‌ల‌ను క‌నండి!

Update: 2020-03-05 17:30 GMT
ఒక‌వైపు ప్రపంచ జ‌నాభా పెరిగిపోతూ ఉంది. ఈ విష‌యంలో ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతూ ఉన్నాయి. ఉన్న వ‌న‌రుల‌కూ, పెరుగుతున్న జ‌నాభాకు సంబంధం లేకుండా పోతోంద‌ని... కొంత‌మంది ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. కొన్ని దేశాల్లో జ‌నాభా ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరిగిపోతూ ఉండ‌టంతో ఈ ఆందోళ‌న వ్య‌క్తం అవుతూ ఉంది. అయితే కొన్ని దేశాలు మాత్రం త‌మ‌కు జ‌నాభా కావాల‌ని అంటున్నాయి!

కొన్ని దేశాల్లో జ‌నాభా పెద్ద‌గా పెర‌గ‌డం లేదు. మ‌రి కొన్ని చోట్ల వృద్ధుల సంఖ్య ఎక్కువై పోయి, యువ‌త సంఖ్య త‌గ్గిపోతూ ఉంది. జ‌నాభా ఎక్కువగా ఉండ‌క‌పోవ‌డం కీల‌క‌మే. ఇదే స‌మ‌యంలో ఉన్న జ‌నాభాలో కూడా స‌మ‌తుల్య‌త ఉండాలి. లేక‌పోతే ఏ దేశ ప్ర‌గ‌తి అయినా దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. ఇప్పుడు ఈ త‌ర‌హా స‌మ‌స్య‌నే ఎదుర్కొంటోంద‌ట వెనుజులా.

ఆర్థిక ప‌ర‌మైన ఇబ్బందుల‌తో ఇటీవ‌లి కాలంలో ఆ దేశం వార్త‌ల్లోకి వ‌చ్చింది. విప‌రీత స్థాయి సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో ఆ దేశం ఇక్క‌ట్ల పాలైన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. ఆ సంగ‌త‌లా ఉంటే... ఆ దేశాధ్య‌క్షుడు పిల్ల‌ల‌ను క‌నాలంటూ త‌న దేశ మ‌హిళ‌ల‌కు పిలుపునిచ్చారు. అది కూడా ఒక్కోరు క‌నీసం 6 మంది పిల్ల‌ల‌ను క‌నాలంటూ ఆయ‌న కోరారు. అది దేశానికి మేలు చేస్తుంద‌ని, దేశం మేలు కోసం ఒక్కో మ‌హిళ ఆరు మంది పిల్ల‌ల‌ను క‌నాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్ర‌తి ఒక్క మ‌హిళా ఈ ప‌ని చేయాలన్నారు.


Tags:    

Similar News