ఇవాల్టి దూకుడు రాజకీయాల్లో నేతల మీద ఆకర్ష్ అస్త్రం ఎంతలా పని చేస్తుందో రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్ని చూస్తుంటే ఇట్టే అర్థమైపోతుంది. పవర్ లేకుండా మనగలగటం అంత తేలిక కాదన్నట్లుగా నేతల తీరు ఉంది. అధికార అండ ఉంటే తమ రాజకీయ భవితకు ఢోకా ఉండదన్న భావన రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి కారణాలు చాలానే ఉన్నా.. ఈ స్థాయిలో జంపింగ్స్ మాత్రం గతంలో లేవనే చెప్పాలి.
ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జంపర్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ప్రజాప్రతినిధులు పార్టీ మారితే వారి పదవి అదే రోజు పోయేలా చట్టం తీసుకొస్తేనే ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందని వ్యాఖ్యానించారు. తాను చేసిన వ్యాఖ్యలు తన మిత్రులను ఇబ్బంది పెట్టేదిగా ఉన్నప్పటికి ఆయన ఎలాంటి మొహమాటం లేకుండా ఈ తరహా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
నాలుగోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయనకు ఆత్మీయ అభినందన సభ జరగ్గా.. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన తాజా రాజకీయాల మీద ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గుర్తుపై గెలిచిన వారు పార్టీ మారితే అదే రోజు వారి పదవి కోల్పోయేటట్లు చట్టంలో మార్పు తీసుకొస్తేనే పరిస్థితుల్లో మార్పు వస్తుందన్న వ్యాఖ్య చేయటం గమనార్హం. సిద్ధాంతాలు నచ్చకపోతే పార్టీలు మారే స్వేచ్ఛ ఉందన్న ఆయన.. తాజా స్వార్థ రాజకీయాలపై తనకున్న ఏవగింపును ఏ మాత్రం దాచుకునే ప్రయత్నం చేయకపోవటం గమనార్హం.