= రాష్ట్రానికి రూ.65వేల కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టుల కేటాయింపు. విజయవాడ రింగు రోడ్డు మంజూరు
( తెలంగాణ రాష్ట్రానికి చేసిన కేటాయింపులు చూస్తే.. ఏపీకి ప్రత్యేకంగా చేసిందేమిటో ఇట్టే అర్థమవుతుంది. విజయవాడకు రింగు రోడ్డు కేటాయిస్తేనే అంతా అయిపోతుందా? దానికే గొప్పలు చెప్పుకోవాలా?)
= పట్టణాభివృద్ధి శాఖ నుంచి విజయవాడ.. గుంటూర్లకు రూ.500కోట్ల చొప్పున ఇచ్చాం
(చెప్పేందుకు సిగ్గుండాలి. తెలంగాణ బడ్జెట్ లో వరంగల్ పట్టణానికి కేసీఆర్ సర్కారు రూ.300 కోట్ల కేటాయించుకుంది. ఒక రాష్ట్ర సర్కారే అంత భారీగా నిధులు కేటాయిస్తే.. కేంద్రం ఇచ్చే నిధులు స్థాయి ఏమిటో ఇట్టే అర్థమవుతుంది)
= విశాఖ.. కాకినాడలను స్మార్ సిటీలుగా అభివృద్ధి చేయనున్నాం
(స్మార్ట్ సిటీలన్నది కేంద్రపథకం.. ఏపీకి ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమిటి?)
= హృదయ్ పథకం కింద అమరావతికి రూ.22కోట్లు ఇచ్చాం
(అమరావతి నగర నిర్మాణానికి రూ.3లక్షల కోట్లకు పైనే నిధులు అవసరం. దాంతో పోలిచ్చినప్పుడు కేంద్రం ఇచ్చిన రూ.22కోట్లు ఎంత పరిమాణం?)
= విశాఖపట్నం.. విజయనగరం.. శ్రీకాకుళం.. అనంతపురం.. కడప.. కర్నూలు.. చిత్తూరు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద నిధుల మంజూరు
(పావలా.. అర్థరూపాయి ఇస్తేనే గొప్పలు చెప్పే మీరు.. ఈ జిల్లాలకు ఇచ్చిన నిధుల సంఖ్యను చెప్పకపోవటం చూస్తేనే.. ఎంత తక్కువ ఇచ్చారో అర్థమవుతుంది)
= సుగంధ ద్రవ్యాల పార్కును మంజూరు చేశాం
(ఇప్పుడు మంజూరు చేస్తే.. ఎప్పటికి పూర్తి అయ్యేను. పూర్తి కావటానికి నిధులు ఏ రేంజ్ లో ఇచ్చారో ఎందుకు చెప్ప నట్లు..?)
= కృష్ణపట్నం అంతర్జాతీయ లెదర్ కాంప్లెక్స్ మంజూరు
(పూర్తి అయ్యే సంగతి చెప్పొచ్చుగా వెంకయ్య?)
= పాలసముద్రంలో భెల్ ప్రాజెక్ట్ కోసం రూ.300కోట్ల కేటాయింపు
(ఈ పప్పు బెల్లాల కేటాయింపులతో ప్రయోజనం కలిగేదెంత?)
= నాగాయలంకలో డీఆర్ డీఓ మిస్సైల్ పరీక్షా కేంద్రం - నావల్ ఎయిర్ స్టేషన్ - రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ టెక్నాలజీ - గిరిజన విశ్వవిద్యాలయం - కేంద్రీయ విశ్వవిద్యాలయం - పెట్రోలియం విశ్వవిద్యాలయం - నెల్లూరు జిల్లాలో దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు పరిశీలనలో ఉన్నాయి.
(పరిశీలనలో ఉన్న వాటిని కూడా గొప్పలకు ప్రచారం చేసుకోవటంలోనే మీ చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుంది)
= మంగళగిరిలో ఎయిమ్స్ శంకుస్థాపన చేశాం
(శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఏపీలో ఎన్ని పూర్తి అయ్యాయో వెంకయ్యకు తెలీదా?
= 14వ ఆర్థిక సంఘ సిఫార్సుల మేరకు ఏపీకి రూ.41,464 కోట్లు ఇస్తున్నాం. గతంలో ఈ మొత్తం కేవలం రూ.29,347 కోట్లు మాత్రమే
(విభజన కారణంగా ఏటా హైదరాబాద్ నగరం ద్వారా వచ్చే రూ.50వేల కోట్లు పోగొట్టుకున్న దాంతో పోలిస్తే.. కేంద్రం ఇచ్చేది ఎంత? ఏపీకి జరుగుతున్న వాస్తవ నష్టం ఎంత..?)