కేంద్రమంత్రి వెంకయ్యపై ఈ మధ్యన సీపీఐ సీనియర్ నేత నారాయణ పరుష వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. వెంకయ్య పంచెలు ధరించొద్దని.. ఫ్యాంట్లు వేసుకోవాలని.. ఆయన కానీ పంచెలు వేసుకుంటే.. వాటిని ఊడదీసి మరీ జనాలు కొడతారంటూ తీవ్రస్థాయిలో మండి పడటం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వెంకయ్య తనదైన శైలిలో స్పందించారు.
తనపై తీవ్ర వ్యాఖ్య చేసిన నారాయణ పేరును సైతం ప్రస్తావించని ఆయన.. ఏకంగా కమ్యూనిస్ట్ లను ఓ రేంజ్ లో ఏసుకున్నారు. దేశంలో కమ్యూనిస్ట్ ల గురించి మాట్లాడటం వృధాగా తేల్చేసిన వెంకయ్య.. పూర్వం కమ్యూనిస్ట్ లలో నిజం ఉండేదని.. ఇప్పుడు అలాంటిదేమీ లేదని తేల్చేశారు. చైనాలో సైతం కనిపించే కమ్యూనిజం బయట మాత్రమేనని.. లోపలంతా క్యాప్టిలిజంగా చెప్పారు.
కమ్యూనిస్ట్ లకు దేశ సమైక్యత మీద కానీ.. రాజ్యాంగం మీద కానీ విశ్వాసం లేదన్నవెంకయ్య.. వామపక్ష వాదులు ప్రజా సమస్యల్ని వదిలేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘వారికి జ్యోతిలక్ష్మి నడుమెంత? వెంకయ్య పంచెలో ఏముంది లాంటివే కావాలి’’ అంటూ ఎద్దేవా చేశారు. చూస్తుంటే.. వెంకయ్య జ్యోతి లక్ష్మి నుంచి అప్ డేట్ కానట్లుందే?