కాఫీడే య‌జ‌మాని సూసైడ్ చేసుకున్నారా?

Update: 2019-07-30 06:45 GMT
కారులో వెళుతూ.. ఫోన్ మాట్లాడ‌టం కోసం కారు ఆపి న‌డుచుకుంటూ ముందుకెళ్లి.. అదృశ్య‌మైన మాజీ సీఎం కుమారుడు.. కేఫ్ కాఫీ డే వ్య‌వ‌స్థాప‌కుడు వి.జి. సిద్ధార్థ అదృశ్యం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నారా? అన్న  సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ అనుమానాన్ని బ‌ల‌ప‌ర్చేలా ఆయ‌న రాసిన లేఖ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

మంగ‌ళూరులోని నేత్రావ‌ది న‌ది వంత‌న ద‌గ్గ‌ర కారు దిగిన ఆయ‌న‌.. ఫోన్ మాట్లాడుతూ న‌డుచుకుంటూ వెళ్లిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత క‌నిపించ‌క‌పోవ‌టం.. ఆయ‌న కోసం పెద్ద ఎత్తున వెతుకులాట స్టార్ట్ కావ‌టం తెలిసిందే. వంతెన మీద నుంచి దూకి ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నారా? అన్న‌ది ఇప్పుడు సందేహంగా మారింది. ఇదిలా ఉంటే.. ఆయ‌న క‌నిపించ‌కుండా ఉండ‌టానికి ముందు త‌న కాఫీడే ఉద్యోగులు.. కంపెనీ బోర్డు డైరెక్ట‌ర్ల‌కు రాసిన లేఖ.. ఆత్మ‌హ‌త్య సందేహాన్ని బ‌ల‌ప‌డేలా చేస్తోంది.

సిద్ధార్థ త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ కు రాసిన లేఖ‌ను కొన్ని జాతీయ మీడియా సంస్థ‌లు బ‌య‌ట‌కు తీసుకొచ్చాయి. అందులో పేర్కొన్న అంశాలు ఆస‌క్తిక‌రంగానే కాదు.. ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు వెన‌కున్న‌కార‌ణాల్ని చెప్పేలా ఉండ‌టం గ‌మ‌నార్హం. 37 ఏళ్ల త‌న కృషితో 30వేల మందికి ప్ర‌త్య‌క్షంగా.. 20 వేల మందికి ప‌రోక్షంగా ఉద్యోగాల్ని తాను క‌ల్పించిన‌ట్లుగా పేర్కొన్నారు. ఇప్పుడు తానెన్నో మంచి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ లాభ‌దాయ‌క వ్యాపారాన్ని సృష్టించ‌టంతో తాను ఫెయిల్ అవుతున్న‌ట్లుగా  లేఖ‌లో రాశారు.

సుదీర్ఘ‌కాలం నుంచి పోరాడుతున్నాన‌ని.. ఇక పోరాడే ఓపిక త‌న‌కు లేద‌న్నారు. "అందుకే అన్ని వ‌దిలేస్తున్నా. ఒక ప్రైవేటు ఈక్విటీలోని భాగ‌స్వాములు షేర్ల‌ను బైబ్యాక్ చేయ‌మ‌ని బ‌ల‌వంతం పెడుతున్నారు. ఇక‌.. ఆ ఒత్తిడిని నేను తీసుకోవాల‌నుకోవ‌టం లేదు.  ఆదాయ‌ప‌న్ను శాఖ గ‌త డీజీ నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా. నాపై మీరంతా ఎంతో న‌మ్మ‌కాన్ని ఉంచారు. దాన్ని వమ్ము చేస్తున్నందుకు క్ష‌మించండి. కొత్త యాజ‌మాన్యంతో మీరంతా బ‌లంగా ఉండి ఈ వ్యాపారాన్ని ఇలానే కొన‌సాగించండి" అంటూ ఆయ‌న పేర్కొన్నారు.

సంచ‌ల‌నంగా మారిన ఈ లేఖ‌లో త‌న  త‌ప్పుల‌న్నింటిని త‌న‌దే బాధ్య‌త‌గా పేర్కొన్నారు. తాను చేసిన లావాదేవాల గురించి త‌న మేనేజ్ మెంట్ కుకానీ.. ఆడిట‌ర్ల‌కు కానీ తెలీద‌ని.. అన్నింటికి తానే జ‌వాబుదారిన‌ని.. తానెవ‌రినీ మోసం చేయాల‌నుకోవ‌టం లేద‌న్నారు. తానో ఫెయిల్యూర్ వ్యాపార‌వేత్త‌న‌ను.. త‌న‌ను క్ష‌మించాల‌ని సిద్ధార్థ్ త‌న లేఖ‌లో కోరారు. తాజాగా ఆయ‌న్ను క‌నుగొనేందుకు 200 మంది స‌భ్యుల‌తో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. గ‌జ ఈత‌గాళ్ల సాయంతో నేత్రావ‌తి న‌దిని జ‌ల్లెడ ప‌డుతున్నారు. ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.
Tags:    

Similar News