ఆ లేడీ ఎమ్మెల్యేకు ప్రచార మోజు ఎక్కువైందని వైసీపీలో అందరూ ఇప్పుడు ఆడిపోసుకుంటున్నారు. లోకల్ సమస్యలను వదిలేస్తున్న ఆమె రాష్ట్రంలోని సమస్యలపై ఫోకస్ చేస్తూ వాటి మీద పోస్టర్లు వేసుకుంటున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఫొటోలకు ఫోజులివ్వడంలో ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారంలో ఉండడం లేదని విమర్శలు వస్తున్నాయి.
గుంటూరు జిల్లాలో తొలిసారి ఎమ్మెల్యే అయిన చిలకూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ ఆ మధ్య మంత్రి పదవి కోసం తెగ ట్రై చేశారు. ఇప్పటికే చాన్స్ దొరికతే తనకే వచ్చేలా ఏపీ ఎమ్మెల్యేలందరిలో ఫోకస్ అవుతున్నారు. ఈ నియోజకవర్గంలో అసలు ఏ ప్రాజెక్టులు లేవు. అధ్వానంగా ఉన్న రహదారుల నిర్మాణం.. ఈఎస్ఐ ఆసుపత్రి ఇక్కడి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. తాగడానికి నీళ్లు లేక ఇవ్వండని ప్రజలు గొంతు చించుకుంటున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
అయితే స్థానిక ఎమ్మెల్యే విడుదల రజినీ స్టైల్ మాత్రం చాలా డిఫెరెంట్.. స్థానికంగా సమస్యలు ఎన్నో ఉన్నా.. సీఎం జగన్ ఏ పథకం.. ప్రాజెక్ట్ ప్రకటించినా అందులో తన ఫొటో.. జగన్ ఫొటో వేసుకొని ఏకంగా పోస్టర్లు విడుదల చేసుకొని సోషల్ మీడియాలో హోరెత్తించడం ఈమె నైజం అని నియోజకవర్గంలో ప్రజలు విమర్శిస్తున్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం అయినా..విజిలెన్స్ ఇంటెలిజెన్స్ విభాగం ఏర్పాటైనా..రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై పోస్టర్లు, కటౌట్లు వేసుకొని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటున్నారట.. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీం ఏర్పాటు చేసుకొని మరీ విడదల రజినీ ప్రచారహోరులో కొట్టుకుపోతున్నారట.. జగన్ తర్వాత తనే ప్రాజెక్టులన్నీ ఏపీకి తీసుకొస్తున్నట్టు రజినీ బిల్డప్ ఇస్తోందని వైసీపీలోనే కథలు కథలుగా చెప్పుకుంటున్నారట..
ఇలా చిలకలూరిపేట సమస్యలను గాలికొదిలేసి.. ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలను తన క్రెడిట్ గా ఖాతాలో వేసుకోవడం విడుదల రజినీ నియోజకవర్గంలో చేస్తోందట.. ఇప్పుడు ఇదే ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందట.. ఏడాది గడిచినా నియోజకవర్గ సమస్యలు పట్టని విడుదల రజినీ ప్రచార స్టంట్ కు పనులు కాక జనాలు ఆగ్రహంగా ఉన్నట్టు నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.