పంజాలోని మొహాలి నగరంలో ఉన్న చంఢీగఢ్ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిల వీడియోలు పోర్న్ సైటులో పెట్టారనే వార్తలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అదంతా అబద్ధమని పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. యూనివర్సిటీలో చదివే ఒకే ఒక అమ్మాయి అభ్యంతరకర స్థితిలో వీడియో తీసుకుని తన బాయ్‌ఫ్రెండుకు పంపిందని అంటున్నారు. అతడు హిమాచల్ ప్రదేశ్‌లో చదువుతున్నాడని పేర్కొంటున్నారు. ఆ అమ్మాయి అసభ్య వీడియోలను ఆమె ఫోనులోనే చూసిన చంఢీగఢ్ యూనివర్సిటీ విద్యార్థినులు కంగుతిన్నారు. తాము స్నానాలు చేసేటప్పుడు తమ వీడియోలను కూడా ఆ అమ్మాయి చిత్రీకరించి ఉంటుందని ఆందోళన చెందారు.
తమ వీడియోలు పోర్న్ సైటులో ఉన్నాయని వార్తలు రావడంతో చాలామంది అమ్మాయిలు తీవ్ర ఆందోళన చెందారు. పలువురు ఆత్మహత్యకు ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. అయితే వీటిని పోలీసులు ఖండించారు. ఎవరూ ఆత్మహత్యకు పాల్పడలేదని చెప్పారు. ఒకే ఒక అమ్మాయి ఈ ఘటనతో స్పృహ తప్పి పడిపోయిందని.. దీంతో ఆ అమ్మాయిని ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. అమ్మాయిలెవరూ పుకార్లు నమ్మవద్దని.. ఎవరి వీడియోలు లీక్ కాలేదని చెప్పారు. ఆ అమ్మాయి వీడియో మాత్రమే.. అది కూడా తను తన ప్రియుడికి అభ్యంతరకర స్థితిలో తీసుకుని పంపిందని తెలిపారు. ఆ అమ్మాయితోపాటు ఆమె ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామన్నారు.
సోషల్ మీడియాలో కానీ, పోర్న్ వెబ్‌సైట్లలో కానీ అమ్మాయిల వీడియోలు లేవని తేల్చిచెప్పారు. దయ చేసి పుకార్లను నమ్మవద్దని పోలీసులు తెలిపారు. మరోవైపు యూనివర్సిటీ యాజమాన్యం రెండు రోజుల సెలవులు ప్రకటించింది. పెద్ద సంఖ్యలో అమ్మాయిలు యూనివర్సిటీలో బైఠాయించారు. విద్యార్థినుల ఆందోనళతో యూనివర్సిటీ అట్టుడుకుతుంది. పోలీసులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై లాఠీచార్జి చేశారని వారు ఆరోపించారు. తమ వీడియోలు లీక్ కాకపోతే యూనివర్సిటీ యాజమాన్యం రెండు రోజులు సెలవులు ఎందుకు ప్రకటించిందని నిలదీశారు.
పోలీసులు మాత్రం ఇప్పటివరకు జరిగిన తమ దర్యాప్తులో నిందితురాలు ఒకే ఒక్క వీడియోను మాత్రమే గుర్తించినట్టు చెప్పారు. ఆమె ఇంకెవరి వీడియోలనూ రికార్డు చేయలేదని తేల్చిచెప్పారు. వర్సిటీలో పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వాటిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపనున్నట్టు తెలిపారు.
యూనివర్సిటీ వీసీ ఆర్ఎస్ బవా కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. 60 మంది అమ్మాయిల ఎంఎంఎస్లు లీకయ్యాయనేది అబద్దమన్నారు. విద్యార్థినుల కోరిక మేరకు విచారణను పోలీసులకు అప్పగించామన్నారు. అన్ని మొబైల్ ఫోన్లను, ఇతర పరికరాలను పోలీసులకు ఇచ్చామన్నారు.
కాగా ఈ వ్యవహారంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మండిపడ్డారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. తప్పుచేసిన వారు ఎవరైనా కఠిన చర్యలు తప్పవన్నారు. నిరంతరం అధికారులతో టచ్‌లో ఉంటానని.. ఊహాగానాలను ఎవరూ నమ్మొద్దని కోరారు.
మరోవైపు ఈ ఘటనను సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) తెలిపింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ.. పంజాబ్ డీజీపీ, చండీగఢ్ వర్సిటీ వీసీకి లేఖ రాశారు. అలాగే, ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ మనీశా గులాటీ వెల్లడించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.