బాబుకు షాక్‌..కుప్పంలో అవినీతి..రంగంలోకి విజిలెన్స్‌..!

Update: 2019-10-21 11:06 GMT
ఏపీ మాజీ సీఎం - టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు దిమ్మ‌తిరిగే షాక్‌. నేను నిప్పును.. నాకు అవినీతి అంటిస్తా రా? అంటూ.. ఆయ‌న నిన్న మొన్న‌టి వ‌ర‌కు గంభీర ప్ర‌క‌ట‌న‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఇప్పుడు తాజాగా.. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం దాదాపు మూడు ద‌శాబ్దాలుగా ఆయ‌న‌కు విజ‌యాన్ని అందిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలోనే అవినీతి సెగ‌లు పొగ‌లు క‌క్కుతున్నాయ‌ని అంటున్నారు అధికారులు.

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టిన‌.. స‌బ్ కాల్వ విష‌యంలో చోటు చేసుకున్న అవినీతి ఇప్పుడు బాబు మెడ‌కు చుట్టుకుం టోంద‌ని చెబుతున్నారు. దీంతో జ‌గ‌న్ స‌ర్కారు విజిలెన్స్ అధికారుల‌ను రంగంలోకి దింపింది. కుప్పం కాలువ పనుల అంచనా నుంచి అదనపు చెల్లింపు వ్యవహారం వరకు గత ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిందని ప్రస్తుత సర్కార్ భావిస్తుంది. . ఈపీసీ ద్వారా 4 శాతం అదనంగా కోట్ చేసి రూ.430.26 కోట్లకు పనులు దక్కించుకున్న జాయింట్‌ వెంచర్‌ సంస్థలు ఒప్పందం మేరకు 123.641 కిలోమీటర్ల కాలువ తవ్వకం చెయ్యాల్సి వుంది.

అంతే కాదు 324 స్ట్రక్చర్స్, 5 చోట్ల ఎన్‌హెచ్‌ క్రాసింగ్‌ పనులు, 3 చోట్ల ఎత్తిపోతల పథకాల నిర్మాణం, 110 చెరువులకు నీరు అందించే పనులు పూర్తి చెయ్యాల్సి ఉంది. ఇక ఈ పనులు ఒప్పందం మేరకు 9 నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా నేటికీ పూర్తి కాలేదు. ఇప్ప‌టికే గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో చేప‌ట్టిన ప‌ను ల‌పై దృష్టి పెట్టిన జ‌గ‌న్ ప్ర‌బుత్వం ఇప్పుడు చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గంలోనే అవినీతి జ‌రిగింద‌నే వార్త‌ల నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంది.

పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో జరిగిన పనుల్లో అధిక మొత్తానికి కాంట్రాక్టును క‌ట్ట‌బెట్టార‌ని, ఫ‌లితంగా ఖ‌జానాకు వంద‌ల కోట్ల‌లో న‌ష్టం వ‌చ్చింద‌నేది అధికారుల వాద‌న‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ ఇంజ నీర్,ముగ్గురు జేఈలు తనిఖీలు చేపట్టారు. అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

మదనపల్లెలోని ఎస్సీ కార్యాలయంలో ఉన్న పత్రాలను చాలా నిశితంగా పరిశీలిస్తున్న అధికారులు ఏయే పనులను రికార్డు చేశారు. ఇక ఈ ఉప కాలువ పనులు నిబంధనల మేరకు కొనసాగాయా లేదా అన్న అంశాలను సైతం పరిశీలిస్తున్నారు. ఇక నేడు డైరెక్టర్‌ జనరల్‌ కాలువ పనులను పరిశీలించనుండటంతో ఆ శాఖ అధికా రులు ముందస్తుగా నివేదికలు సిద్ధం చేసుకున్నారు.  దీనిలో ఏ మాత్రం అవ‌క‌త‌వ‌క‌లు న‌మోదైన‌ట్టు రుజువైనా.. చంద్ర‌బాబుకు ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


Tags:    

Similar News