అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' చిత్రాలతో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్ దేవరకొండ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. తన పుట్టిన రోజు సందర్బంగా అభిమానులకు ఐస్ క్రీమ్ ఇస్తున్న రౌడీ స్టార్ తనకు మాత్రం ఎలాంటి బర్త్ డే గిఫ్ట్ లు రాలేదని సరదాగా కామెంట్ చేశాడు. పుట్టిన రోజు సందర్బంగా విజయ్ దేవరకొండ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి మరియు తన యాటిట్యూడ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసి, మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
పెళ్లి విషయమై మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా లేదంటే లివ్ ఇన్ రిలేషన్ షిప్ ను ఇష్టపడతారా అంటూ ప్రశ్నించిన సమయంలో లవ్ మ్యారేజ్ లేదా పెద్దలు కుదిర్చిన వివాహం అయ్యి ఉండవచ్చు అన్నాడు. ప్రస్తుతానికి కొందరు మైండ్ లో ఉన్నారు. వారి విషయంలో ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అమ్మా నాన్న ఒక నిర్ణయానికి వచ్చి నాకు చెప్తారు. అయితే ప్రస్తుతానికి అయితే పెళ్లి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చాడు.
నిన్ననే మమ్మీ నాతో మాట్లాడుతూ వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో పెళ్లి చేసుకోవాలంది. నేను పెళ్లి ఎందుకు చేసుకోవాలంటే పిల్లలు పుట్టాలి కదా అంది. పిల్లల కోసం నేను పెళ్లి చేసుకోవాలా, వారి కోసం నేను నా జీవితంను ఎందుకు మార్చుకోవాలని అన్నాను. నా జీవితం నేను కోరుకున్నట్లుగా ఉండాలని భావిస్తున్నాను. నేను హీరోను కనుక అది చేయాలి, ఇది చేయాలి అన్నట్లుగా ఉండను, నాకు ఏది చేయలనిపిస్తే అదే చేస్తాను. నాకు ఏది అయితే సంతృప్తిని ఇస్తుందని భావిస్తానో అది నేను చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.
ఇక తన యాటిట్యూడ్ పై స్పందిస్తూ.. నాకు చాలా పొగరు ఉంది, కాని నాకు మంచి మనసు ఉంది. కొంత మంది నాకు నచ్చుతారు, కొందరు నచ్చరు. కొన్ని సార్లు హ్యాపీగా ఉంటాను, కొన్ని సార్లు కోపంగా ఉంటాను, మరి కొన్ని సార్లు సాడ్ గా ఉంటాను. నాకు ఎప్పుడు ఏది అనిపిస్తే అది బయటకు వస్తుంది. దాన్ని అంతా కూడా యాటిట్యూడ్ అంటారు. ఒక మామూలు మనిషిలాగే నేను ఉంటాను, కాని కొందరు మాత్రం నన్ను ప్రత్యేకంగా చూస్తారు.
మీరు ఫారినర్ అమ్మాయితో డేటింగ్ లో ఉన్నారా అనే ప్రశ్నకు ఉండొచ్చేమో అన్నట్లుగా సమాధానం చెప్పాడు. ఇంకా పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పి కన్ఫ్యూజ్ చేశాడు. ప్రస్తుతం ఈయన 'డియర్ కామ్రేడ్' చిత్రంతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాడు. సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న విజయ్ దేవరకొండకు ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ ను తెచ్చి పెడతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.