తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. ఈ ఫాలోయింగ్ ను ఉపయోగించుకుని రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశాలున్నట్లు ఇంతకుముందే సంకేతాలిచ్చాడు విజయ్. ఐతే మంచి టైమింగ్ కోసం ఇంకా కొన్నేళ్లు ఎదురు చూడాలని అతను భావిస్తున్నాడు. ఐతే విజయ్ వల్ల జయలలితకు ఏం ఇబ్బంది వచ్చిందే ఏమో.. ఆమె కొన్నేళ్లుగా అతణ్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. 2011 ఎన్నికలకు ముందు విజయ్ తండ్రి చంద్రశేఖర్ నేరుగా జయను కలిసి తన మద్దతు ప్రకటించాడు.
చంద్రశేఖర్ సపోర్ట్ ఇచ్చాడంటే విజయ్ కూడా ఆమె వైపు ఉన్నట్లే. విజయ్ అభిమానులు సైతం జయలలిత విజయం కోసం పని చేశారు కూడా. కానీ జయ మాత్రం విజయ్ ను ఇగ్నోర్ చేసింది. అతణ్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది. తలైవా.. కత్తి.. పులి.. ఇలా గత కొన్నేళ్లుగా విజయ్ చేసిన చాలా సినిమాలకు విడుదల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. రాజకీయాల్లోకి రావాలన్న విజయ్ ఆలోచనకు గండి కొట్టాలనో.. నరేంద్ర మోడీని ఇంటికి పిలిపించుకుని డాబు చూపించాడనో.. కారణం ఏదో కానీ.. విజయ్ మీద జయ కక్ష గట్టినట్లు వ్యవహరించిన మాట వాస్తవం.
దీనికంతటికీ విజయ్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. విజయ్ ఈ ఎన్నికల్లో పరోక్షంగా కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే పార్టీకి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ అభిమాన సంఘాలకు ఈమేరకు ఆదేశాలు కూడా వెళ్లిపోయాడట. బయటపడకుండా డీఎంకే విజయం కోసం పని చేయాలని సమాచారం అందిందట. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు విజయ్ డీఎంకేకు మద్దతుగా బహిరంగ ప్రకటన కూడా చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమ్మ ఓడిపోతే ఓకే కానీ.. ఆమె మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం విజయ్ కు చుక్కలు చూపించడం ఖాయం.