లిక్కర్ కింగ్ గా భారత వాణిజ్య వర్గాల్లో ఓ రేంజీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విజయ్ మాల్యా... ఇప్పుడు బ్యాంకులకు రుణాలు ఎగవేసిన ఎగవేతదారుడిగా అపఖ్యాతి మూటగట్టుకున్నారు. అయితే ఈ అపఖ్యాతిని లైట్ గా తీసుకున్న మాల్యా... తన కుటుంబంతో సహా సడీ చప్పుడు లేకుండా లండన్ చెక్కేశారు. అప్పటిదాకా మాల్యా నుంచి రుణాలను రాబట్టుకునే పనిని అంతగా పట్టించుకోని బ్యాంకులు ఆ తర్వాత కోర్టు మెట్లెక్కక తప్పని పరిస్థితిలో పడ్డాయి. బ్యాంకుల అభ్యర్థన మేరకు కోర్టులు మాల్యాకు నోటీసుల మీద నోటీసులు జారీ చేశాయి.
ఈ నోటీసులను మాల్యా పట్టించుకున్న దాఖలానే కనిపించలేదు. అంతేకాకుండా బ్యాంకులతో పాటు దర్యాప్తు సంస్థలపైనా ఆయన తనదైన శైలిలో రెచ్చిపోయారు. కేసుల దర్యాప్తు నేపథ్యంలో లండన్ లో సుఖంగానే ఉన్నప్పటికీ... అజ్ఞాతవాసాన్నే గడిపిన మాల్యా పెద్దగా బయటకు వచ్చిన దాఖలా లేదు. తనకు అత్యంత ప్రీతిపాత్రమైన తన ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటతీరును కూడా చూడలేకపోతున్నానని మాల్యా ఆవేదన వ్యక్తం చేసిన వైనం కూడా మనకు తెలిసిందే. అడపాదడపా మ్యాచ్ ను చూసినా... ఎక్కడ చూశానన్న విషయాన్ని వెల్లడించలేని దుస్థితిని మాల్యా ఎదుర్కొన్నారు.
ఇదంతా గతమనుకుంటే... నిన్న మాల్యా అరెస్ట్, ఆ తర్వాత కోర్టులో హాజరుపరచడం, ఆ వెంటనే కోర్టు ఆయనకు బెయల్ మంజూరు చేయడం జరిగిపోయాయి. ఈ క్రమంలో తన అజ్ఞాతవాసం ముగిసిపోయిందని భావించారో, ఏమో తెలియదు గానీ.. నిన్నటి నుంచి మాల్యా తన ట్విట్టర్ ఖాతా ద్వారా యమా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో తన జట్టు తరఫున ఆడుతున్న విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్... నిన్నటి మ్యాచ్ లో చేసిన పరుగులతో పొట్టి ఫార్మాట్ లో 10 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా రికార్డు పుటలకెక్కాడు. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఉండలేకపోయిన మాల్యా... గేల్ ను ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అటు క్రీడా వర్గాల్లోనే కాకుండా పారిశ్రామిక వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/