కింగ్ ఫిషర్ మాజీ ఎండీ విజయ్ మాల్యా భారతీయ బ్యాంకులకు కోట్ల డబ్బును ఎగవేసి యూకేకు పారిపోయిన సంగతి అందరికి తెలిసిందే. మాల్యాను తిరిగి ఇండియాకు రప్పించేందుకు జరుగుతోన్న ప్రయత్నాలేవి సక్సెస్ కావడం లేదు. మాల్యా తిన్న డబ్బును కక్కించేందుకు భారత ప్రభుత్వం - అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా.. మాల్యా మాత్రం లండన్ లో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా విజయ్ మాల్యా ఎఫ్ 1 రేసింగ్ కు హాజరై తన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యుడు క్రిస్ గేల్ తో కలిసి ఫొటోకు పోజులిచ్చాడు. వెస్టిండీస్ క్రికెటర్ ఈ చిత్రాన్ని ట్విట్టర్ లో పంచుకున్నప్పుడు - చాలా మంది భారతీయులు మాల్యాను లక్ష్యంగా చేసుకుని..., అతడిని 'చోర్' అని ట్వీట్లలో విమర్శించారు.
దీనిపై స్పందిస్తూ - యూనివర్సల్ బాస్ మరియు నా ప్రియమైన స్నేహితుడిని కలుసుకోవడం చాలా బాగుంది. నన్ను `చోర్` అని పిలిచి ఓడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్లు తమ సొంత బ్యాంకుల నుంచి గత యేడాది కాలంగా నా డబ్బు తీసుకోవాలని చెపుతున్నా... వారు తీసుకోవడం లేదు... ఇప్పుడు చోర్ ఎవరో ? మీరే చెప్పాలన్నాడు. మాల్యా చాలా నిజాయితీగా ఉన్నప్పుడు - అతడు ఇండియా నుంచి తప్పుకుని యూకే కు వెళ్లి లండన్ లో స్థిరపడటానికి కారణమేమిటో ? అతడే చెప్పాలి.