బాబు బుద్ధి మెద‌డు నుంచి మోకాళ్ల‌కు దిగింది!

Update: 2018-07-11 04:35 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి. ఏపీ సీఎంగా బాబు కొన‌సాగ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్న ఆయ‌న‌..బాబుకు మతిభ్ర‌మించింద‌న్నారు. చంద్ర‌బాబు దుర్మార్గుడ‌ని.. ఆయ‌న అవినీతిప‌రుడ‌న్నారు.

దేశాన్ని కొల్ల‌గొట్టిన వ్య‌క్తి త‌ప్ప‌కుండా జైలుకు వెళ‌తార‌న్న విజ‌య‌సాయి రెడ్డి.. బాబు బుద్ధి మెద‌డు నుంచి మోకాలికి దిగిపోయింద‌న్నారు. అలాంటి వ్య‌క్తి ముఖ్య‌మంత్రిగా ఉండ‌టం బ్యాడ్ ల‌క్ అన్నారు. మ‌తిభ్ర‌మించిన వ్య‌క్తి రాజ్యాంగ ప‌ర‌మైన ప‌ద‌వుల్లో ఉండ‌కూడ‌ద‌ని.. ఈ లెక్క‌న బాబు ముఖ్య‌మంత్రిగా ఉండ‌కూడ‌ద‌న్నారు. బాబు సంపాదించిన ల‌క్ష‌ల కోట్ల రూపాయిల్ని హ‌వాలా మార్గంలో విదేశాల‌కు త‌ర‌లించార‌ని ఆరోపించారు.

బాబు బినామీ ఆస్తుల్ని ఏపీలో పెడితే క‌నీసం రాష్ట్రం బాగుప‌డుతుంద‌న్న విజ‌య‌సాయి.. స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్రాన్ని.. దేశాన్ని కొల్ల‌గొడుతున్నార‌న్నారు. దోచుకున్న సొమ్ము దాచుకోవ‌టానికే చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న చేస్తున్న‌ట్లు చెప్పారు.  టీటీడీ జేఈవో సింగ‌పూర్ ఎందుకు వెళ్లార‌ని..? ఆయ‌న‌కు అక్క‌డ ఏం ప‌ని? అంటూ నిల‌దీశారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక బాబు చేసిన మోసాల‌పై విచార‌ణ చేయిస్తామ‌న్నారు.

రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీ.. దాని మిత్ర‌ప‌క్షాలు ఎవ‌రిని అభ్య‌ర్థిగా నిల‌బెట్టిన త‌మ పార్టీ మ‌ద్ద‌తు ఇవ్వ‌ద‌ని విజ‌య‌సాయి తేల్చిచెప్పారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్ర‌యోజ‌నాలే కీల‌క‌మ‌ని..రాష్ట్రానికి ఎవ‌రైతే మేలు చేస్తారో వారికే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు. ఏపీకి ఏ పార్టీ అయితే ప్ర‌త్యేక హోదా ఇస్తుంద‌ని హామీ ఇస్తారో ఆ పార్టీకి తాము మ‌ద్ద‌తు ప‌లుకుతామ‌ని త‌మ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎప్పుడో స్ప‌ష్టం చేశార‌ని.. దానికే తామంతా క‌ట్టుబడి ఉంటామ‌న్నారు.
Tags:    

Similar News