ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. ఓ పక్క సామాన్యులు - నిరుపేదలు నిలువ నీడ లేక నానా తిప్పలు పడుతోంటే....మరో పక్క `హ్యాపీ నెస్ట్` అంటూ చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీశారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. అమరావతిలో స్కూళ్ళు - హాస్పిటళ్ళు కట్టి....ఏడాదిలోపు పేదలందరికీ ఇళ్ళు కట్టిస్తామని 2015లో చంద్రబాబు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. అమరావతి ప్రాంతంలోని గ్రామాలు కనీస వసతులు లేక కునారిల్లుతుంటే ...బాబు మాత్రం రియల్ ఎస్టేట్ పైనే శ్రద్ధ పెట్టారని ఉదయ్యబట్టారు. తలసరి ఆదాయంలో ఏపీ నంబర్ వన్ అని - గ్రామ సీమలు వెలిగిపోతున్నాయంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ట్విటర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డారు.
ప్రజా రాజధానిగా చెప్పుకునే అమరావతి సంపన్నుల రాజధాని కాబోతోందేమోనని విజయ సాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. `హ్యాపీ నెస్ట్` పేరుతో చంద్రబాబు సరికొత్త రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారని - ఆ జోరు చూడబోతే ధనవంతులకు తప్ప సామాన్యులకు రాజధానిలో చోటు దక్కే చాన్స్ కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. ప్రజా రాజధాని అమరావతి కూడా ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీగా కాబోతోందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తలసరి ఆదాయంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ అని చంద్రబాబు చెబుతున్నారని - గ్రామ సీమలు వెలిగిపోతున్నాయని గొప్పలు పోతున్నారని అన్నారు. ఆ విషయాలను గోడ రాతల ద్వారా ప్రచారం చేయాలని చంద్రబాబు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల అప్పు చేశారని - దాని వల్ల ప్రతి ఒక్కరి తలపై ఎంత అప్పుందో గోడ రాతల ద్వారా చెప్పే ధైర్యం చంద్రబాబు కుందా అని ఆయన ప్రశ్నించారు.