కన్నా సుజనాకి అమ్ముడుపోయాడా ?

Update: 2020-04-20 11:50 GMT
ఏపీలో ఒకవైపు కరోనా మహమ్మారి చాలా వేగంగా విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి రాష్ట్రం పై ఒకవైపు దాడి చేస్తున్న సమయంలో ..రాజకీయ వేడి మళ్లీ రాజుకుంది. కరోనా టెస్ట్ కిట్ల పై ఇప్పుడు ఏపీలో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది. ముఖ్యంగా వైసీపీ - బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌ గఢ్ రూ.337కి కిట్ కొంటే.. ఏపీ ప్రభుత్వం రూ.730కి కొనుగోలు చేసిందని ప్రతిపక్షాలు విమర్శల కు దిగాయి. ఈ సమయంలో రాజకీయ వేడికి ఆజ్యంపోసింది ఏపీ బీజేపీ అధినేత కన్నా లక్ష్మీనారాయణ .. కరోనా కిట్లలో కూడా కమీషన్ కొట్టారా.. మన పక్క రాష్ట్రం ఛత్తీస్ గఢ్ కరోనా కిట్లను దక్షిణకొరియా నుండి కేవలం రూ.337+GSTకి కొన్నారు. మరి మీరు అదే దక్షిణ కొరియా నుండి తెప్పించిన లక్ష కిట్లు ఎంతకు తెచ్చారు. ఈ రెండు కిట్ల రేట్లలో తేడాని ప్రజలకు చెప్పి ప్రభుత్వం పారదర్శకత నిరూపించుకోవాలి అని కన్నా అన్నారు. కన్నా చేసిన ఈ వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయాలలో తీవ్ర దుమారం రేగింది.

కన్నా లక్ష్మీనారాయణకు వైసీపీ కీలక నేత - ఎంపీ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లక్ష్మీనారాయణ రూ. 20 కోట్ల రూపాయలకు చంద్రబాబుకు అమ్ముడుపోయారని.. టీడీపీ మాజీ నేత - ఎంపీ సుజనా చౌదరి ద్వారా డీల్ జరిగిందని విమర్శించారు. సుజనా చౌదరి మధ్యవర్తిత్వం నిర్వహించి చంద్రబాబు - కన్నాను కలిపారని.. అందుకే చంద్రబాబు తరహాలోనే కన్నా కూడా ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే దేశ వ్యాప్తంగా మోడీ ఇమేజ్ పెరిగినా కూడా రాష్ట్రంలో పార్టీ ఎదగకపోవడానికి బాబుకి అమ్ముడుపోయిన కన్నా లాంటి వారే కారణం అని - బాబు ప్యాకేజ్ ఆఫర్ ఎలాగుంటుందంటే ..రాజకీయంగా అవసాన దశలో ఉన్నవారిని లేపి కూర్చోపెడుతుంది. రాష్ట్రంలో పార్టీ ఎదగాలంటే ..మొదటి నుండి బీజేపీలో ఉన్నవారు కన్నా లాంటి జంబూకాలను వదిలించుకోవాలని హితవు పలికారు.

అలాగే తాజాగా మరోసారి ..మళ్లీ అడుగుతున్నా...కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? లేదా? టీజేపీ (టీడీపీ జాకాల్స్‌ పార్టీ) వారు కాకుండా బీజేపీ వారు నా మీద విమర్శలు చేస్తే సమాధానం ఇస్తా... అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే , ఏపీ సర్కార్ పై బీజేపీ సీనియర్ లీడర్ - ఉప రాష్ట్రపతి వెనకయ్య నాయుడు గారు ప్రశంసలు కురిపిస్తుంటే ..మరో వైపు ఏపీ బీజేపీ అధినేత మాత్రం విమర్శలు కురిపిస్తున్నాడు. దీనితో కన్నా అసలు ఎందుకు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే , ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తే విజయసాయి రెడ్డి ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేలా కనిపించడంలేదు. చూడాలి మరి ఈ వివాదానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో ...
Tags:    

Similar News