విజ‌య సాయి రెడ్డి సంచలన ట్వీట్ లు చూశారా?

Update: 2018-10-31 05:16 GMT
విశాఖ ఎయిర్ పోర్ట్‌ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై క‌త్తితో హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఉదంతం ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఈ అంశంపై తాజాగా జ‌గ‌న్ పార్టీ ముఖ్య‌నేత క‌మ్ ఎంపీ విజ‌య‌ సాయి రెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్స్ చేశారు.

జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన జనుప‌ల్లి శ్రీ‌నివాస‌రావుకు సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర అంశాల‌తో పాటు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై విజ‌య సాయి రెడ్డి  ఆస‌క్తిక‌ర ట్వీట్స్ ను పోస్ట్ చేశారు. జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన శ్రీ‌నివాస‌రావు కాల్ లిస్ట్ ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. ఏడాది వ్య‌వ‌ధిలో ప‌దివేల‌కు పైగా కాల్స్ శ్రీ‌నివాస్ చేసిన‌ట్లుగా గుర్తించారు. ఈ కాల్స్ డేటాను పోలీసులు ఇప్పుడు ప‌రిశీలిస్తున్నారు.

శ్రీ‌నివాస్ పోన్ నుంచి ఒక మ‌హిళ‌కు ఎక్కువ కాల్స్ వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. స‌ద‌రు మ‌హిళ ఎవ‌ర‌ని గుర్తించిన పోలీసులు అందులో భాగంగా ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న‌ట్లుగా స‌మాచారం.  ఆమెతో పాటు మ‌రో ఇద్ద‌రిని కూడా అదుపులోకి తీసుకొని ప్ర‌శ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే శ్రీ‌నివాస‌రావుకు సంబంధించి ఎంపీ విజ‌య‌ సాయి రెడ్డి ట్విట్ట‌ర్ లో ట్వీట్స్ చేశారు. ముందుగా తాను అనుకున్న ప‌థ‌కంలో భాగంగా శ్రీ‌నివాస్ ను సీఎం చంద్ర‌బాబు ఏం చేయ‌బోతున్నారో? అన్న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు.

జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన వెంట‌నే డీజీపీతో టీడీపీ శ్రేణులు వ్య‌వ‌హ‌రించిన తీరు చూస్తుంటే.. వారి కుట్ర ఆలోచ‌న‌లు ఏమిటో స్ప‌ష్టమ‌వుతున్నాయ‌ని.. బాబు పిరికివాడే కానీ.. హ‌త్యా రాజ‌కీయాల్లో అనుభ‌వం చాలా ఉంద‌న్నారు. రాజ‌కీయంగా జ‌గ‌న్ ను ఎదుర్కొన‌లేక‌.. ఇలాంటి పిరికి చ‌ర్య‌కు పాల్ప‌డి ఉంటార‌న్నారు.

జ‌గ‌న్ పై హత్యాయ‌త్నం చేసిన నిందితుడు శ్రీ‌నివాస‌రావు ఆరోగ్యం బాగోలేదంటూ కేజీహెచ్ కు పోలీసులు త‌ర‌లిస్తున్న సంద‌ర్భంలో త‌న‌కు ప్ర‌జ‌ల‌తో మాట్లాడేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని.. త‌న‌కు ప్రాణ‌హాని ఉందంటూ నిందితుడు వేడుకుంటున్న వీడియోను విజ‌య‌ సాయి రెడ్డి పోస్ట్ చేశారు.  రోజుల త‌ర‌బ‌డి శ్రీ‌నివాస్ ను విచారిస్తున్న పోలీసులు.. నోరు విప్ప‌టం లేద‌ని మీడియాకు లీకులు ఇస్తుంటే.. మ‌రోవైపు ప్ర‌జ‌ల‌తో మాట్లాడే అవ‌కాశం క‌ల్పించాలంటూ మీడియాను వేడుకుంటున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా ఉంది. నోరు విప్ప‌టానికి ఇష్ట‌ప‌డ‌ని వ్య‌క్తి.. ప్ర‌జ‌ల‌తో మాట్లాడే అవ‌కాశం క‌ల్పించాలంటూ ఎందుకు వేడుకుంటాడు..?



Tags:    

Similar News