2011 నాటి తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి తరఫున బరిలోకి దిగిన కెప్టెన్ విజయ్ కాంత్ సారథ్యంలోని డీఎండీకే 29 సీట్లలో గెలిచి ప్రతిపక్ష హోదాను సొంతం చేసుకుంది. అలా రాష్ట్రంలో ప్రధాన పార్టీల సరసన చేరింది. దీంతో 2016 ఎన్నికల్లో సత్తా చాటాలని కెప్టెన్ అనుకున్నారు. సీఎం అభ్యర్థిగా ప్రకటించేసుకున్నారు. మరోవైపు కెప్టెన్ సత్తా గమనించిన కారణంగా ఈ ఏడాది శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ చాణక్యుడైన డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సైతం డీఎండీకేకు పలుమార్లు బహిరంగ ఆహ్వానం పలికారు. అనూహ్యంగా ప్రజాసంక్షేమ కూటమితో చేతులు కలిపిన విజయకాంత్ ఆ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలయ్యారు. ఉళుందూర్ పేట్టైలో పోటీ చేసిన ఆయన డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.
గత ఎన్నికల్లో సుమారు పదిశాతం ఓట్లు తెచ్చుకుని తమిళనాడులో అధికారం చేపట్టే సత్తా ఉన్న పార్టీగా గుర్తింపు పొందిన డీఎండీకే.... తాజా శాసనసభ ఎన్నికల్లో 2.6 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. పొత్తుపై కెప్టెన్ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీలో చీలికరావడంతో పాటు పలువురు అధికారపక్షం - ఇతర పార్టీలకు వలసలు మొదలుపెట్టారు. దీంతో డీఎండీకే శిబిరం నెమ్మదిగా పలుచబడిపోతోంది. శాసనసభ ఎన్నికల తర్వాత డీఎండీకే శిబిరం దాదాపు ఖాళీ అయింది. తిరుగుబాట్లు-పార్టీ ఫిరాయింపులు-అసమ్మతి సెగలను ఎదుర్కొంటున్న ఆ పార్టీలో ప్రస్తుతం శ్రేణుల సందడి ఏమాత్రం కనిపించడంలేదు. ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు సైతం పెద్దగా ఎవ్వరూ రాకపోవడం ఆ పార్టీ అధినేత విజయకాంత్ ను అయోమయంలో పడేస్తోంది. భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆయన ఆందోళన చెందుతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఆయన ఉన్నారు. డీఎండీకే 12వ వ్యవస్థాపక వేడుకలు చెన్నై కోయంబేడులోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సందర్భంగా వేళ్లమీద లెక్కపెట్టే స్థాయిలోనే పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. గతంలో జరిగిన దినోత్సవానికి కార్యకర్తలతో కిటకిటలాడిన ప్రధాన కార్యాలయం ఈ సంవత్సరం అందుకు పూర్తి భిన్నంగా కనిపించింది. అంతా కలిపినా 50 మంది కూడా లేకపోవడంతో విజయకాంత్ ను దిగ్భ్రాంతికి గురిచేసింది. అలాగే పార్టీ జెండా ఆవిష్కరించి కార్యాలయంలోకి వెళ్లిపోయారు.
ఈ పరిణామాలతో అసహనానికి గురైన విజయకాంత్ ఈ విషయమై పార్టీ జిల్లా నిర్వాహకులతో తన అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలిసింది. కార్యకర్తల గైర్హాజరీకి కారణమేంటని ప్రశ్నించారని సమాచారం. శ్రేణులను సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కావేరి నదీ జలాల వివాదంపై పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలోనూ ఇదే తీరు కనిపించింది. దీనికైనా పెద్దసంఖ్యలో కార్యకర్తలను తీసుకొచ్చి బలాన్ని చూపించాలని, లేకపోతే పార్టీపరంగా చర్యలు తప్పవంటూ జిల్లా నిర్వాహకులను హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోవడం గమనార్హం. ప్రస్తుత పరిణామాలతో పార్టీ భవిష్యత్తు దృష్ట్యా విజయకాంత్ ఆందోళన చెందుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎండీకే పోటీ చేసే విషయమై ఆయనకు స్పష్టత కూడా లేదని పార్టీ వర్గాల సమాచారం. ఇదంతా కెప్టెన్ సొంతంగా తీసుకున్న నిర్ణయాల ఫలితమేనని అంటున్నారు.