గత నాలుగు రోజులుగా కర్ణాటక - తమిళనాడు రాష్ట్రాల మధ్య నీరే నిప్పై దహించివేస్తుంది. కావేరీ జలాల విషయంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం కర్ణాటకలో మొదలైన రచ్చ.. తమిళనాడుకు వ్యాప్తించింది. ఫలితంగా... ఇప్పటికే వేల కోట్ల నష్టం - రెండు ప్రాణాలు - ఎంతో మందికి గాయాలు - అసంఖ్యాక ప్రజలకు ఇబ్బందులు. ఈ క్రమంలో తాజాగా తమిళనాడులో కూడా రాష్ట్ర బంద్ జరుగుతుంది. ఈ సందర్భంగా మిగిలిన విషయాలన్నీ పక్కనపెట్టిన అన్ని రాజకీయ పార్టీలూ రోడ్లపైకి వచ్చాయి. ఎవరి స్థాయిలో వారు పోరాటాలు చేయడం మొదలుపెట్టారు. అయితే.. ఈ తమిళనాడు బంద్ లో డీఎండీకే చీఫ్ విజయ కాంత్ మాత్రం కనిపించలేదు!
కావేరీ జలాల పంపణి విషయంలో, బెంగళూరులో తమిళ ప్రజల మీద దాడులు జరిగాయని శుక్రవారం తమిళనాడు బంద్ జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు - అన్ని వర్గాల ప్రజలూ పాలొన్న ఈ భారీ కార్యక్రమంలో డీఎండీకే చీఫ్ క్యాప్టెన్ విజయ్ కాంత్ కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. తమిళ ప్రజల మీద దాడులు చేస్తే సహించనని - కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చెయ్యకుంటే తాను నీరాహారదీక్ష చేస్తానని ఈ మధ్యకాలంలో కెప్టెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నిరాహార దీక్ష సంగతి కాసేపు పక్కన పెడితే.. కర్ణాటకలో తమిళులపై జరిగిన అల్లర్లపై బంద్ చేయాలని తమిళనాడు రాష్ట్రం మొత్తం ఏకమైన సందర్భంగా ఆయన కనిపించకుండా పోయారు.. దీంతో ఎంతో ఊహించుకున్న డీఎండీకే కార్యకర్తలు డీలా పడ్డారు.
అయితే విజయ్ కాంత్ తరుపున ఆయన భార్య ప్రేమలత విజయ కాంత్ డీఎండీకే కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయంలో ధర్నా నిర్వహించి అనంతరం బంద్ లో పాల్గొన్నారు. అయితే ఈ విషయాలపై ఆరాతీసినవారికి మాత్రం... విజయ్ కాంత్ ఆరోగ్యం బాగలేదని, అది తప్ప మరో కారణం లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.