విద్యార్థికి అండ‌గా నిలిచిన జ‌గ‌న్ పార్టీ!

Update: 2018-08-27 09:17 GMT
లైంగిక వేధింపుల‌తో పాటు.. అత్యాచార య‌త్నానికి పాల్ప‌డిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ పోరాడుతున్న విద్యార్థికి జ‌గ‌న్ పార్టీ అండ‌గా నిలిచింది. విశాఖ ఒకేష‌న‌ల్ జూనియ‌ర్ కాలేజీలో గ‌త వారం జ‌రిగిన అత్యాచార య‌త్నాన్ని తీవ్రంగా ఖండించింది.విద్యార్థిపై అత్యాచార య‌త్నానికి పాల్ప‌డిన కాలేజీ క‌రస్పాండెంట్ వెంక‌ట స‌త్య‌ న‌ర‌సింహ కుమార్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ను బాధిత విద్యార్థిని ఆశ్ర‌యించింది.

ఈ నేప‌థ్యంలో కాలేజీ విద్యార్థుల‌తో క‌లిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌ సాయి రెడ్డి క‌లెక్ట‌ర్ కు విన‌తి ప‌త్రాన్ని ఇచ్చారు. మాయ‌మాట‌లు చెప్పి విద్యార్థిని ఇంటికి పిలిపించుకొని అత్యాచార య‌త్నం చేయ‌బోయిన మాన‌వ మృగాన్ని క‌ఠినంగా శిక్షించాల‌ని కోరారు. ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థిపై క‌ర‌స్పాండెంట్ అత్యాచార య‌త్నం చేసిన వైనం వెలుగులోకి వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించింది.
Tags:    

Similar News