బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పిన విజయసాయి రెడ్డి

Update: 2023-02-01 17:33 GMT
రాజకీయంగా బాగా తిట్టుకునే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ ఎమ్మెల్యే కం బాలకృష్ణలు ఈ విషయంలో మాత్రం ఒకరికొకరు అభినందనలు తెలుపుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల నారా లోకేష్ యువగళం పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన నటుడు తారకరత్న బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయనను సినీ, రాజకీయ ప్రముఖులు, బంధువులు పరామర్శిస్తున్నారు.

బెంగళూరులో చికిత్స పొందుతున్న తారకరత్నను అతడి భార్య తరుఫు బంధువు అయిన ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా బెంగళూరుకు వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు.

‘తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది. గుండెపోటు వచ్చిన రోజు 45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయినందున మెదడులో పైభాగం కొంత దెబ్బతింది. వాపు తగ్గాక కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు. గుండె చక్కగా పనిచేస్తోంది. రక్తప్రసరణ బాగుంది. బాలకృష్ణ అన్ని సౌకర్యాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. బాలయ్యకు కృతజ్ఞతలు’ అని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

45 నిమిషాలు గుండె ఆగిపోవడం వల్ల మెదడులో పైభాగం దెబ్బతిన్నదని.. దాని వల్ల మెదడులో నీరు చేరి మెదడు వాచిందని వైద్యులు తెలిపారని విజయసాయిరెడ్డి అన్నారు. వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని డాక్టర్లు తెలిపారు.

బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు... మెదడుపై భాగం దెబ్బతినడంతో కొన్ని అవయవాలు కొంత యాక్టివ్ గా పనిచేయడం లేదని డాక్టర్లు తెలిపారు. గుండె బాగానే పనిచేస్తుంది.. తారకరత్న త్వరలోనే కోలుకుంటారని విజయసాయిరెడ్డి తెలిపారు.

బెంగళూరులోని నారాయణ హృదయాలయలో నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తాజాగా బులిటెన్ లో తారకరత్నకు మరికొన్ని పరీక్షలు అవసరమని.. వాటిని నిర్వహించిన తర్వాత హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని తెలిపారు. ఆస్పత్రిలో తారకరత్న తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్యరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News