రాజకీయంగా సవాలచ్చ అనుకోవచ్చు. అదేం తప్పు కాదు. సున్నితమైన విషయాల్లో దూకుడు అస్సలు మంచిది కాదు. మొదట బాగానే ఉన్నా.. నిజాలు నిగ్గు తేలిన తర్వాత ఇబ్బందులకు గురి కావటం ఖాయం. ఒకవేళ.. పక్కా సమాచారం ఉంటే.. మరే మాత్రం ఆలస్యం చేయకుండా అరెస్టు చేసేసి.. ఇష్యూను ఒక కొలిక్కి తీసుకురావాలే తప్పించి రాజకీయ ప్రకటనల మాదిరి వ్యాఖ్యలు చేయటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భద్రాద్రి రామాలయానికి తీసిపోని ప్రశస్తి విజయనగరం రామతీర్థానికి ఉందని చెబుతారు. అలాంటి దేవాలయంలో 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి కోనేరులో పడేసిన వైనం షాకింగ్ గా మాత్రమే కాదు.. పెను సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న విమర్శలు ఉన్నాయి. అయితే.. ఈ అంశంపై సీఎం జగన్ సీరియస్ కావటమే కాదు.. బాధ్యులపై కఠిన చరర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదిలా ఉంటే.. రామతీర్థం ఘటన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు కమ్ ఎమ్మెల్సీ లోకేశ్ కనుసన్నలలో జరిగినట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణ పెను సంచలనంగా మారింది. టీడీపీ నేతలే కొండపై ఉన్న దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేసి కోనేరులో పడేశారని ఆరోపించారు. ఎవరికి సాయం చేసే గుణం చంద్రబాబుకు లేకున్నా.. స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరినైనా తాకట్టు పెట్టే సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఈ మాటలు ఎలా ఉన్నా.. సున్నితమైన అంశంపై ఇంత దూకుడుగా ప్రకటన చేయటం సరికాదంటున్నారు.
పెను సంచలనంగా మారిన అంశంపై త్వరపడి రాజకీయ ప్రకటనలు చేసే బదులు.. పోలీసు ఉన్నతాధికారులు తమ విచారణలోని అంశాల్ని ప్రకటిస్తే బాగుంటుంది. నిజాన్ని నిగ్గు తేల్చే బాధ్యతను అధికారులకు అప్పగించటం ఉత్తమం. రాజకీయంగా సవాలచ్చ విభేదాలు ఉండొచ్చు. అంత మాత్రాన.. త్వరపడి ఆరోపణలు చేయటం సరికాదు. ఈ విషయంలో విజయసాయి దూకుడు విమర్శలకు అవకాశం ఇస్తుందన్న మాట వినిపిస్తోంది. విజయసాయి ఆరోపించినట్లుగా నిజంగానే.. చంద్రబాబు.. లోకేశ్ హస్తం ఉండి ఉంటే.. ఆధారాల్ని చూపించి వారిని అరెస్టు చేస్తే సరిపోతుంది కదా? అలా ఎందుకు చేయనట్లు..?