కేసీఆర్ ఆరోగ్యంపై విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు.. దుమారం

Update: 2023-03-13 11:17 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యాడు. ఆదివారం ఉదయం గ్యాస్ట్రిక్ సమస్యలతో స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.

గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలోని వైద్యబృందం కేసీఆర్ కు అనేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్టు గుర్తించినట్టు తెలిసింది.

కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. మందులతో తగ్గిపోతుందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇక వైద్య పరీక్షల అనంతరం తిరిగి ప్రగతి భవన్ కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు.

కేసీఆర్ వెంట ఆస్పత్రికి ఆయన సతీమణి శోభ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ స్పీకర్ , మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు ఉన్నారు.

ఇెక కేసీఆర్ ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలోచేరడంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'ఢిల్లీ లిక్కర్ స్కాంలో మీడియా నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ ఆస్పత్రిలో చేరి ఉంటారని' కామెంట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన విజయశాంతి కేసీఆర్ గారు మీకు అనారోగ్యమని హాస్పిటల్ లో అడ్మిట్ అవుతారు. ఇక బీఆర్ెస్ నాయకులందరూ ఈడీ విచారణ దుర్మార్గమంటారు అంటూ విమర్శించారు. ఇంత జరిగినా ఈ స్కాంతో కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేదంటూ ఎందుకు చెప్పరు అంటూ విజయశాంతి ప్రశ్నల వర్షం కురిపించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News