ఆమె ఒకప్పుడు పెద్ద స్టార్..... తెలుగు చిత్ర పరిశ్రమనే కాదు...... ఇతర భాష చిత్రాలలో కూడా నటించి పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో రాములమ్మగా గుర్తింపు పొందారు. తర్వాత రాజకీయాలపై మక్కువతో రాజకీయ రంగ ప్రవేశం చేసారు. దగాపడ్డ తెలంగాణ అంటూ ఓ పార్టీనే ఏర్పాటు చేసారు. లోక్ సభ సభ్యురాలు అయ్యారు. ఆమె ఎవరో ఈ పాటికే అర్దమయే ఉంటుంది. తెలుగు చిత్ర సీమలో లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రసమితిలో చేరి కొన్నాళ్ల పాటు ఓ వెలుగు వెలిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేత చెల్లి అని పిలిపించుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరికి చెడింది. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చి - కాంగ్రెస్ లో చేరారు. అక్కడ కొన్నాళ్లు యాక్టివ్ గా ఉన్న విజయశాంతి ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. రాష్ట్రం విడిపోయి తెలంగాణలో కె. చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయ్యాక రాజకీయాల నుంచి పూర్తిగా దూరమయ్యారు విజయశాంతి. ముందస్తు ఎన్నికల పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని మళ్లీ వెలుగులోకి తీసుకు వచ్చింది. ఆమెను స్టార్ క్యాంపెయన్ కమిటీకి చైర్ పర్సన్ గా నియమించింది. ఇది జరిగి నెల దాటింది.
ముందస్తు ఎన్నికలలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ వెండి తెర వేల్పుల ప్రచారాన్ని ఆశిస్తోంది. రెండు దశాబ్దాలకు పైగా తెలుగు చిత్ర సీమతో అనుబంధం ఉన్న విజయశాంతి టాలీవుడ్ కు చెందిన నటీనటులు - దర్శకులు - నిర్మాతలు - సాంకేతిక నిపుణులను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారానికి తీసుకుని వస్తారని కాంగ్రెస్ పార్టీ భావించింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా విజయశాంతి వల్ల పార్టీకి మేలు జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే సీన్ మారిపోయింది. విజయశాంతి నుంచి ఆశించిన స్ధాయిలో స్పందన రావటం లేదు. స్టార్ క్యాంపేయిన్ చైర్ పర్సన్ హోదాలో ఓ బహిరంగ సభలో పాల్గున్న విజయశాంతి కత్తి పట్టి గాలిలో ఊపడం మినహా కాంగ్రెస్ పార్టీకి చేసింది ఏమి లేదు. ఇప్పటి వరకూ విజయశాంతి తెలుగు చిత్ర సీమకు చెందిన ఒక్కరిని కూడా కలిసిన దాఖలాలు లేవని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. "విజయశాంతి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి మేలు జరగలేదు. భవిష్యత్తులో జరుగుతుందన్న ఆశా లేదు" అని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకూ నో స్టార్స్... నో క్యాంపేయిన్.... అన్నట్లుగానే పరిస్థితి ఉందని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల తేది కూడా ప్రకటించడంతో ముందు ముందైన విజయశాంతి స్టార్ క్యాంపేయిన్ ముమ్మరం చేస్తారా అని ఆశిస్తున్నారు.