ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి విజయశాంతి.. తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. టీఆర్ఎస్ లో ఉన్నంత కాలం ఒక వెలుగు వెలిగిన ఆమె.. ఆ పార్టీ నుంచి బయటికి వచ్చాక ఫేడవుట్ అయిపోయింది. టీఆర్ఎస్ నుంచి బయటికొచ్చాక ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఐతే ఇప్పుడు ఆమె ఆ పార్టీలో ఉన్న సంగతే చాలామందికి తెలియదు. ఎక్కడా రాములమ్మ వాయిసే వినిపించట్లేదు.
ఐతే ప్రత్యర్థులపై దీటుగా విమర్శలు చేసే విజయశాంతిని సరిగ్గా వాడుకుంటే తమ పార్టీకి బాగానే పనికొస్తుందని తెలంగాణ తెలుగుదేశం అగ్రనేత రేవంత్ రెడ్డి భావిస్తున్నాడట. ఆయన ఇప్పటికే రాములమ్మను తమ పార్టీలోకి ఆహ్వానించాడట. ఆమె కూడా ఈ పార్టీలో చేరడానికి ఆసక్తిగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో విజయశాంతి చేరిక వ్యవహారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి దగ్గర ఉంది. త్వరలోనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. రాములమ్మ తెలుగుదేశంలో చేరడం లాంఛనమే అని భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదేదో ఊహించుకుని అందులో చేరింది విజయశాంతి. కానీ అక్కడ ఆమెకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. ప్రస్తుతం నామమాత్రంగా ఆ పార్టీలో ఉంటోంది విజయశాంతి. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలనుకుంటున్న విజయశాంతికి ఒక వేదిక అవసరం. మరోవైపు కీలక నేతలందరినో కోల్పోయిన తెలుగుదేశం పార్టీకి కూడా విజయశాంతి లాంటి వాయిస్ ఉన్న నాయకురాలు అవసరం. తెలంగాణ తెలుగుదేశంలో గట్టిగా మాట్లాడే మహిళా నేతలే లేరిప్పుడు. ఈ నేపథ్యంలో పార్టీలో విజయశాంతి చేరిక ఉభయతారకంగా ఉంటుందని భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/