తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఓవైపు హాట్ హాట్ గా అసెంబ్లీ సమావేశౄలు సాగుతుంటే...మరోవైపు రాజకీయాలు సైతం కీలక మలుపులు తిరుగుతున్నాయి. టాలీవుడ్ ఒకనాటి టాప్ హీరోయిన్ - ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్న మాజీ ఎంపీ విజయశాంతి అనూహ్య రీతిలో తెరమీదకు వచ్చారు. ఇటీవలి కాలంలో క్రియాశీలంగా ఎక్కడ కనిపించని రాములమ్మ తాజాగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో విజయశాంతి సమావేశమయ్యారు. ఢిల్లీలో రాహుల్ తో జరిగిన ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియా - టీపీసీీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం...త్వరలో ఆమె పాలిటిక్స్‌లో యాక్టివ్ కానున్నారని సమాచారం. కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు స్వీకరించనున్న ఆ పార్టీ యువనేత రాహుల్ గాంధీ రాములమ్మను తన కోర్ టీంలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సినీగ్లామర్ తెచ్చేందుకు....టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు - టీఆర్ ఎస్ పార్టీకి ధీటుగా పని చేస్తారన్న విశ్వాసంతో విజయశాంతికి కాంగ్రెస్ ప్రాముఖ్యతను ఇవ్వనుందని అంటున్నారు. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాములమ్మకు అప్పజెప్పే ఈ బాధ్యతలతో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, నెరవేర్చని హామీలను, మోసపూరిత వాగ్ధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆమెకు ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారని అంచనా వేస్తున్నారు.
2019 ఎన్నికల కోసం పార్టీకి తన సేవలు అందిస్తానని రాములమ్మ ఈ భేటీలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాములమ్మపై కాంగ్రెస్ పార్టీ నమ్మకం పెట్టుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీ హవాను తట్టుకోలేక ఓడిపోయిన రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్‌కు పునర్ వైభవం తీసుకురాగలరా అనేది సందేహమేనని అంటున్నారు. మరోవైపు టీడీపీ మాజీ నేత రేవంత్ చేరికపై ఆమె అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.