కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్‌గా స్క్రీన్ మీదకు తెచ్చిన విజయశాంతి అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేయరట. మెదక్ అసెంబ్లీ నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన విజయశాంతికి ఈసారి కూడా అదే టికెట్ ఇద్దామని కాంగ్రెస్ అనుకుంటున్నా ఆమె మాత్రం పోటీ చేయనని చెప్పేశారు. తాను స్వయంగా ఎన్నికల్లో పోటీచేయకపోయినా కాంగ్రెస్ పార్టీని మాత్రం అధికారంలోకి తెస్తానంటున్నారామె.
ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో నంబర్ 2 పొజిషన్ లో ఉన్నప్పుడు హఠాత్తుగా విజయశాంతి ఆ పార్టీ నుంచి సస్పెండ్ కు గురయ్యారు. కేసీఆర్‌తో ఎక్కడ తేడా వచ్చిందో కానీ ఆమె ఆ పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి మెదక్ అసెంబ్లీ నుంచి పోటీచేసి టీఆర్ ఎస్ అభ్యర్థి పద్మా దేవందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత నాలుగేళ్లుగా ఎక్కడా కనిపించడం లేదు.
ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ అనే కొత్త పోస్టును సృష్టించి కాంగ్రెస్ అధిష్టానం విజయశాంతిని ఎన్నికల కార్యక్షేత్రంలోకి దూకాలని ఆదేశించింది. అయితే, ఆమె మాత్రం తాను పోటీ చేయబోనని.. పార్టీని గెలిపించడానికి కృషి చేస్తానని చెబుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయశాంతి…. కేసీఆర్ టార్గెట్ గా పలు కామెంట్స్ చేశారు. కేసీఆర్ తనను ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటికీ కారణం చెప్పలేదని, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినందుకే ఆ పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్రలేదని కుండబద్దలు కొట్టారు.