ప్రచారం చేసే నేతలు ఎంతమంది ఉన్నా.. స్టార్ క్యాంపైనర్ తీరే వేరబ్బా అనిపించేలా తెలంగాణ కాంగ్రెస్ స్టార్ ఫైర్ బ్రాండ్ రాములమ్మ అలియాస్ విజయశాంతి తానేమిటన్న విషయాన్ని తాజా వ్యాఖ్యతో మరోసారి నిరూపించుకున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అధికార.. విపక్షాల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం మరింత ముదురుతోంది.
ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని చెప్పటమే కాదు.. 119 సీట్లలో 110 సీట్లు తమవేనంటూ అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకంగా చెబుతున్న మాటకు రాములమ్మ ఘాటు పంచ్ విసిరారు. ఒకప్పటి తన దేవుడిచ్చిన అన్నను ఉద్దేశించి రాములమ్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో తన మాటల్ని మరింత షార్ప్ చేస్తున్నారు.
తాజాగా రాములమ్మ మరోసారి కేసీఆర్ ను టార్గెట్ చేసుకొని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వంద సీట్లు పక్కా అని చెప్పే కేసీఆర్ మాటను తిప్పి కొడుతూ.. ఫలితాలు వచ్చాక వంద సీట్లు రావటం తర్వాత.. కేసీఆర్ కు 104 జ్వరం రావటం ఖాయమన్న మాట ఆమె నోటి నుంచి వచ్చింది. ఇంతకీ ఈ మాటను రాములమ్మ ఎక్కడ అన్నారు? అన్న క్వశ్చన్ వేస్తే.. ఈ వ్యాఖ్యను ఆమె ఒక ప్రకటన ద్వారా మీడియా హౌస్ లకు పంపారు.
కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చేందుకు అర్జెంట్ గా తన మదిలోకి వచ్చిన ఐడియాను పేపర్ మీద దించేసి పత్రికాఫీసులకు పంపిన రాములమ్మ.. పనిలో పనిగా కూటమిలోని భాగస్వామ్య పక్షాలను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యల్ని చేయటం గమనార్హం. పొత్తుల్లో బాగంగా భాగస్వామ్య పార్టీలు తాము గెలిచే స్థానాల్ని అడగాలే తప్ప కాంగ్రెస్ గెలిచే స్థానాలు అడగొద్దంటూ ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్ అన్న మీద కూసింత ఘాటుగా రియాక్ట్ అయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ.. కూటమి భాగస్వాముల మీద తొందరపడి మాట రావటం అంత బాగోదేమోనన్న మాట కొందరి నోట వినిపిస్తోంది. మరి రాములమ్మ.. కూటమి మిత్రులకు ఉపదేశాలు ఇవ్వటం తగ్గిస్తారా?. అంతకంతకూ పెంచుతారో చూడాలి.