బెజవాడ దుర్గమ్మ వారి ఆలయంలో రహస్యంగా నిర్వహించినట్లుగా చెబుతున్న తాంత్రిక పూజల విషయంలో కొత్త కోణాలు - రహస్య విషయాలూ తెలిసి వస్తున్నాయి. ఈ తాంత్రిక పూజల వ్యవహారానికి సంబంధించి.. నిజనిర్దారణ కమిటీ విచారణ అనంతరం రూపొందించిన నివేదిక శనినవారం సాయంత్రమే దేవాదాయ శాఖ మంత్రికి - ఆయన ద్వారా ముఖ్యమంత్రికి చేరింది. నివేదికను ముఖ్యమంత్రి కి అందజేసిన తర్వాత.. పైడికొండ మాణిక్యాల రావు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయి.. దీనికి సంబంధించి చర్చించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఇవంతా ఒక ఎత్తు అయితే.. అసలు ఈ తాంత్రిక పూజలు అనేవి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదవీచ్యుతుడు కావాలనే కోరికతో నిర్వహించిన పూజలు అనే బాంబు లాంటి సమాచారం గుప్పుమంటోంది. తెలుగు పార్టీ నాయకుల మధ్యనే గుసగుసల రూపంలో ఈ సంగతి చెలామణీ అవుతోంది. బెజవాడలో దీని గురించి వింటున్న పార్టీ నాయకులు తమలో తామే తర్జన భర్జనలు పడుతున్నారు. పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలను బట్టి.. తెలుగుదేశం పార్టీకే చెందిన ఓ సీనియర్ నాయకుడు –కమ్- పారిశ్రామికవేత్త ఈ పూజలు చేయించారనేది లోగుట్టు. ఎన్నికల జోలికి స్వయంగా వెళ్లే అలవాటు లేకుండానే.. హస్తినలో చక్రం తిప్పే పదవులను వెలగబెడుతున్న ఈ సీనియర్ నాయకుడికి... కొన్నాళ్లుగా చంద్రబాబు మరియు లోకేష్ లతో లోలోపల స్వల్ప విభేదాలు రేగుతున్నట్లు కూడా కొన్ని పుకార్లు ఇదివరకటి నుంచీ చెలామణీలో ఉన్నాయి.
అయితే ఈసారి ఏకంగా.. చంద్రబాబునాయుడు పదవీచ్యుతుడు కావాలని - ఆయన స్థానంలోకి సీఎం హోదా లోకి తానే రావాలనే కోరికతో సదరు కీలకనాయకుడు ఈ తాంత్రిక పూజలు చేయించినట్లుగా పలువురు చెప్పుకుంటున్నారు. చంద్రబాబునాయుడుతో పైకి సన్నిహితంగానే ఉంటూ లోలోన- ఆయన వెనుక గోతులు తీస్తున్నట్లుగా సాగిన ఈ వ్యవహారం గురించి.. చంద్రబాబుకు కూడా సమాచారం ఉన్నదని.. సదరు నాయకుడి మీద చర్యకు ఉపక్రమిస్తే... పార్టీలో అంతా స్సంక్షోభానికి దారితీస్తుందనే భయంతో ఆయన గుంభనంగా ఉన్నారని కూడా కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు.. ఈ నేపథ్యంలో నివురుగప్పిన నిప్పులాంటి ఈ వ్యవహారం ఎటు మలుపులు తిరుగుతుందో అని ప్రజలు అనుకుంటున్నారు. తెదేపాలోని నాయకుడు... అధినేత చంద్రబాబుకు కీడు జరగడం కోసం తాంత్రికపూజలు నిర్వహించారనే సమాచారం విని పలువురు పార్టీ వారే నివ్వెరపోతున్నారు.