సాయిరెడ్డి : నారాయ‌ణ పై సంచ‌ల‌న కామెంట్లు ! ఎ2 వెర్స‌స్ ఎ2

Update: 2022-05-11 16:44 GMT
ప‌దో త‌ర‌గతి ప్ర‌శ్న ప‌త్రాల లీకు వ్య‌వ‌హారంలో మాజీ మంత్రి నారాయ‌ణ అరెస్టు అయి బెయిల్ పై విడుద‌ల‌యిన విష‌యం విధితమే! ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి రాజ్య‌స‌భ స‌భ్యులు సాయిరెడ్డి స్పందించారు. సాంకేతికంగా త‌ప్పించుకున్నా నైతికంగా త‌ప్పించుకోలేరు అని చెప్పి సంచ‌ల‌న రీతిలో వ్యాఖ్య‌లు చేశారు.

ఇక టెన్త్ ప్ర‌శ్న ప‌త్రాల లీకుతో పాటు  రాజ‌ధానికి సంబంధించి సీఐడీ న‌మోదు చేసిన కేసులో కూడా నారాయ‌ణ ఇరుక్కున్నారు. రాజ‌ధానికి సంబంధించిన మాస్ట‌ర్ ప్లాన్ రూప‌క‌ల్ప‌నలోనూ, ల్యాండ్ పూలింగ్ ఇష్యూలోనూ అక్ర‌మాల‌కు ఆయ‌నే కార‌కులు అని చంద్ర‌బాబును ఏ1గా, నారాయ‌ణ ఏ2గా చూపించారు. మ‌రి! ఆ రోజు జ‌గ‌న్ పై న‌మోదు అయిన అక్ర‌మాస్తుల కేసులో ఏ2 సాయిరెడ్డి క‌దా!

సాయిరెడ్డి ఆరోప‌ణ‌లు ఎలా ఉన్నా నారాయ‌ణ పై గ‌తంలో కూడా ఇలాంటి అభియోగాలు చాలా న‌మోదు అయి ఉన్నాయి. మ‌రి! ఆ రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కూ ఆ సంస్థ నిరాటంకంగానే న‌డుస్తోంది. ఎన్ని ఆరోప‌ణ‌లున్నా కూడా ఆ సంస్థ ఆర్థికంగా బ‌లోపేతం అయి ఉంది. ఇప్ప‌టికిప్పుడు నారాయ‌ణ సంస్థ‌ల‌కు వ‌చ్చిన ఇబ్బందేం లేదు కానీ, నారాయ‌ణ అరెస్టుతో కొన్ని విష‌యాలు అయితే వెలుగులోకి వ‌చ్చాయి. ఓ పేల‌వ‌మైన కేసు ఒక‌టి న‌మోదు చేసి ప్ర‌భుత్వం త‌న పంతం నెగ్గించుకోవాల‌ని చూసింద‌న్న‌ది నిజం.

ఇదే మాట టీడీపీ చెబుతోంది. ఇంకొక‌టి ఏంటంటే రాజ‌ధానికి సంబంధించి నిర్మాణాల విష‌య‌మై టీడీపీ తో పాటు హై కోర్టు కూడా ప‌ట్టుబ‌డుతున్న నేప‌థ్యంలో ఇష్యూ డైవ‌ర్ష‌న్ కోస‌మే ఒకే రోజు రెండు కేసులు తెర‌పైకి తెచ్చి డ్రామా న‌డిపారు అని కూడా విమ‌ర్శ ఒక‌టి అచ్చెన్న లాంటి లీడ‌ర్లు చేస్తున్నారు. అంటే ఇప్ప‌టికిప్పుడు ఆ కేసు ప్రూవ్ చేయ‌డం కూడా సాధ్యం కాదు ఎందుకంటే ఆ కేసుకు సంబంధించి ఇప్ప‌టికే అనేక సార్లు కోర్టు విన్న మాట‌లే వింటూ వింటూ వ‌స్తోంది.

ఇక పేప‌ర్ల లీక్ అన్న‌ది జ‌రిగితే, వెంట‌నే ఆ తెలుగు ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాలి. చేయ‌లేదు. పోనీ కుద‌ర‌లేదు అనే అనుకుందాం. మ‌రుస‌టి రోజు ప‌రీక్ష ప‌త్రం కూడా లీక్ అయింది.అది అయినా ర‌ద్దు చేశారా ? లేదు. అంటే వ‌రుస ఆరోప‌ణ‌లు ఉన్నా కూడా వేటినీ బొత్స ప‌ట్టించుకోలేదు. కానీ కేవ‌లం సంచ‌ల‌నం కోస‌మే నారాయ‌ణ‌ను అరెస్టు చేయించార‌న్న‌ది టీడీపీ వాద‌న.

ఇక అక్ర‌మాస్తుల కేసుల‌కు సంబంధించి ఎప్ప‌టి నుంచో వాద‌న‌లు న‌డుస్తున్నా ఇంత‌వ‌ర‌కూ తామేం త‌ప్పులూ చేయ‌లేద‌ని ఇప్ప‌టిదాకా ఒక్క‌సారంటే ఒక్క‌సారి కూడా పెదవి విప్ప‌లేదు సాయిరెడ్డి స‌రికదా! కాంగ్రెస్ పెద్ద‌లు కుట్ర‌పూరితంగా త‌మ‌ను ఇరికించార‌నే చెప్పారు సాయిరెడ్డి అని అంటోంది టీడీపీ. 16 నెలలు జైల్లో ఉన్న మీరు... ఏ ఆధారం లేకుండా జైలుకు వెళ్లి బెయిలు రాకుండా అక్కడే గడిపారా అన్న ప్రశ్నకు మాత్రం క్లారిటీతో వైసీపీ సమాధానం చెప్పలేకపోతోంది. సోనియా కుట్ర అని మాత్రం చెప్పి తప్పించుకుంటోంది. కుట్ర ఎవరు పన్నినా న్యాయస్థానాలు మాత్రం సాక్ష్యాలు లేకపోతే అరెస్టులను ఒప్పుకోవు కదా అన్నది ప్రతిపక్షాల వాదన.
Tags:    

Similar News