రాములమ్మ మళ్లీ గులాబీ రంగేసుకుంటుందట..

Update: 2015-07-21 10:41 GMT
లేడీ అమితాబ్, మాజీ ఎంపీ విజయశాంతి మళ్లీ కారెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కొద్ది రోజుల ముందు ఆమె టీఆరెస్ ను వీడి కాంగ్రెసులో చేరి శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ కావడంతో ఆ పార్టీలో ఉంటే లాభమని భావించి గోడ దూకిన విజయశాంతి అంచనాలు తప్పాయి. కాంగ్రెస్ కుదేలవడంతో ఆమె పరిస్థితి అగమ్య గోచరమైంది. రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.

దీంతో విజయశాంతి మళ్లీ గులాబీ పార్టీ వైపు చూస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.  ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ సిగ్నల్ కోసం విజయశాంతి ఎదురుచూస్తోందని తెలిసింది. రాములమ్మ టీఆర్ఎస్‌లోకి చేరాక ఆమెతోపాటు ఇంకొందరు కూడా రీ ఎంట్రీ ఇస్తారని సమాచారం. పునఃప్రవేశం దిశగా ఇప్పటికే టీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో విజయశాంతి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. మరి రాములమ్మ మళ్లీ టీఆరెస్ లోకి వస్తే మునుపటి ప్రాధాన్యం దొరుకుతుందో లేదో చూడాలి.
Tags:    

Similar News