పాక్ నుంచి చొరబడిన ఉగ్రవాద మూక బరితెగించింది.. యూరీలో విధులు ముగించుకుని వచ్చి టెంట్లలో నిద్రిస్తున్న సైనికులపై దొంగ దెబ్బ తీసింది. వారు చేస్తుంది యుద్దం కాదని - పిరికి పందల చర్యలని నిరూపిస్తూ మరోసారి దొంగ దెబ్బకు పాల్పడ్డారు. గ్రెనేడ్లు విసిరి తుపాకులతో విచక్షణరహితంగా కాల్పులు జరిపి 17 మంది సైనికులను బలి తీసుకున్నారు. అనంతరం ఆ నలుగురు ఉగ్రవాదులనూ ఆర్మీ మట్టుబెట్టింది. ఈ వ్యవహారంపై టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ట్విట్టర్ లో స్పందించారు.
యూరిలోని ఆర్మీ బేస్ పై జరిగిన ఉగ్రదాడిలో అమరులైన 17 మంది జవాన్లకు నివాళులర్పింస్తున్నట్లు ప్రకటించిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి.. దాడికి సంబంధించిన ఒక ఫొటోతో తన సందేశాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తనలో వర్ణించలేని ఎన్నో భావోద్వేగాలకు ఈ ఫొటో లోను చేస్తోందంటూ విరాట్ ట్వీట్ చేశాడు. ఈ నెల 22 నుంచి న్యూజిలాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం కాన్పూర్ లో వెళ్లిన కోహ్లి.. ఈ దాడి తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పాడు. కాగా... 2013లో విరాట్.. బీఎస్ ఎఫ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు.
ఇదిలా ఉంటే.. యూరీలో నిన్న జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల సంఖ్య 17 నుంచి 20కు చేరింది. తీవ్రగాయాలతో ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు జవాన్లు సోమవారం మరణించారు. ఇదే క్రమంలో చికిత్స పొందుతున్న మరికొందరు జవాన్ల పరిస్థితి కూడా విషమంగా ఉంది.