భారతదేశంలో మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య అధికారికంగా 1లక్ష దాటింది. సోమవారం ఉదయం 96180 గా ఉంది. సాయంత్రం నమోదైన కేసులతో కేసుల సంఖ్య లక్ష దాటింది.
దేశ వ్యాప్తంగా సోమవారం 5242 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా 3వేల మందికి పైగా మరణించారు.
మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా ఉంటోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ తీవ్రత అధికంగా ఉంది. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 35000 దాటింది. ఇది ఒక రాష్ట్రంలో నమోదైన కేసుల్లోనే అత్యధికం.. ఇక గ్రీన్ జోన్లలో నెమ్మదిగా అన్నింటికి సడలింపులు ఇస్తూ తెరుస్తున్నారు. ఇక ఇతర జోన్లలో మాత్రం సడలింపులు ఇవ్వడం లేదు. ఒక్క ముంబైలోనే 20000కు పైగా కేసులు నమోదయ్యాయి.
లాక్ డౌన్ మే నెల చివరి వరకు పొడిగించినప్పటికీ అనేక రాష్ట్రాలు ఆంక్షలను తగ్గించి వ్యాపారాలను సడలింపుతో తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాయి. రెడ్ జోన్ , కంటైన్ మెంట్ ప్రాంతాలు మినహా చాలా రాష్ట్రాలు స్థానిక రవాణా, దుకాణాలు, వ్యాపారాలు, వాణిజ్యాలు అన్నింటిని తెరుస్తున్నాయి.
ఇక సినిమా థియేటర్లు, పార్కులు, అమ్యూజ్ మెంట్ పార్కులు, సినిమా షూటింగ్ లు విద్యాసంస్థలు మరిన్ని రోజులు మూసివేయాలని నిర్ణయించారు.
*ఏపీలో కొత్తగా 52 కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కేసుల సంఖ్య తగ్గడం లేదు. రోజూ 50కు పైగానే నమోదవుతున్నాయి. కృష్ణ జిల్లాలో అధికంగా 15 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2432కు చేరింది. ఇందులో 19 కేసులు చెన్నై కోయంబేడు మార్కెట్ కు వెళ్లినవారే కావడం గమనార్హం.ఇప్పటి వరకు మహమ్మారి కారణంగా ఏపీలో 50మంది మరణించారు.
*తెలంగాణ లో కొత్తగా 41 కేసులు
తెలంగాణలో కొత్తగా 41 కేసులు నమోదయ్యాయి. అయితే రికవరీ రేటులో రికార్డు సృష్టించింది. ఇఫ్పటి వరకు మహమ్మారిను జయించి డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1000 దాటింది. కొత్తగా నమోదైన కేసులతో తెలంగాణ లో మొత్తం కేసుల సంఖ్య 1592కు చేరింది.