డేంజర్ జోన్: కరోనాకు కేరాఫ్ గా నిమ్స్

Update: 2020-06-17 16:00 GMT
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. వారం రోజులుగా రోజుకు 200 కేసుల చొప్పున నమోదవుతూ పరిస్థితి చేయిదాటిపోతోంది.

వైద్యులు, వైద్యసిబ్బందికి, ప్రజాప్రతినిధులకు కూడా సోకుతోంది. ఇప్పటికే గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యసిబ్బంది కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే.

తాజాగా పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. ఆస్పత్రిలోని వైద్యులకు కూడా కరోనా సోకింది. తాజాగా పరీక్షల్లో నిమ్స్ ఆస్పత్రిలోని 26మంది వైద్యులతోపాటు.. 40 మంది వైద్యసిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ గా తేలడం కలకలం రేపింది. దీంతో ఆస్పత్రిలోని చాలా విభాగాలను మూసివేశారు. నిమ్స్ ఆస్పత్రి కరోనాకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఆస్పత్రిలోని మెజార్టీ వైద్యులు, సిబ్బందికి కరోనా సోకడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.

బుధవారం ఇద్దరు ప్లాస్టిక్ సర్జన్స్ కు కూడా కరోనా సోకడంతో నిమ్స్ ఆస్పత్రిలోని సిబ్బంది అంతా వణికిపోతున్నారు. ఇప్పటికే నిమ్స్ లోని మిలీనియం బ్లాక్ లో కరోనా బాధితులున్నారు. మరో 40 బెడ్స్ ను ఐపీఎంఆర్ బిల్డింగ్ లో రెడీ చేశారు నిమ్స్ యాజమాన్యం.
Tags:    

Similar News