తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రజలతో పాటుగా, ప్రజాప్రతినిధులు . అధికారులు, పోలీసులు , వైద్యులు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో టీఆర్ ఎస్ కు చెందిన ఎమ్మెల్యే కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది అని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేకానందగౌడ్ - ఆయన భార్య సౌజన్య - కుమారుడు విధాత్ లకు కరోనా పోసిటివ్ గా నిర్దారణ అయినట్టు వైద్యులు నిర్ధారించారని, ఆ కారణంతో ఎమ్మెల్యే తో పాటుగా అయన కుటుంబ సభ్యులు కూడా హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతుంది. ఇంట్లోనే వేర్వేరు గదుల్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. అలాగే ఆయనతో సన్నిహితంగా మెలిగినవారికి టెస్టులు చేయబోతున్నట్టు సమాచారం.
గతంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో పాటుగా ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా - ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి - బాజిరెడ్డి గోవర్ధన్ లకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా కోరనా వైరస్ కు చికిత్స పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. తెలంగాణలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రజా ప్రతినిధులు కూడా కొవిడ్ బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇకపోతే , ఆదివారంనాటి లెక్క ప్రకారం.... తెలంగాణ లో కొత్తగా మరో 1,296 మందికి పాజిటివ్ గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45,076కి చేరింది. అలాగే , తెలంగాణలో మృతుల కేసుల సంఖ్య 415కి చేరుకుంది. కరోనా నుంచి ఇప్పటి వరకు 32,438 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కేసులు ...