ఖైదీలతో విశాఖ జైల్లో ఫుల్ రష్.. కారణం అదేనా?

Update: 2021-12-22 09:34 GMT
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం సెంట్రల్ జైలు ఫుల్ రష్ గా మారింది. సహజంగా ప్రేక్షకులతో సినిమా హాళ్లు నిండుతాయి. కానీ ఏపీలో మాత్రం నేరస్తులు, నిందితులతో జైలు రద్దీగా మారింది. ఉండాల్సిన సామర్థ్యం కన్నా దాదాపు మూడు రెట్ల మందిని ఆ జైల్లో ఉంచడం గమనార్హం. అయితై ఏపీలో నిందితుల సంఖ్య క్రమంగా పెరగడానికి ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ వల్లే ఖైదీల సంఖ్య క్రమంగా పెరుగుతోందని జైలు అధికారులు చెబుతున్నారు.

విశాఖ కేంద్ర కారాగారంలో 940 మంది ఖైదీలు ఉండే సామర్థ్యం కలదు. వసతులు కూడా ఈ మేరకే ఉంటాయి. కానీ ప్రస్తుతం ఆ జైల్లో దాదాపు 2100 మంది ఉంటున్నట్లు సమాచారం. వీరిలో శిక్షపడ్డ వారు 350మంది కాగామిగతా వారంతా రిమాండ్ ఖైదీలే. అందులో గంజా కేసులు సంబంధించిన నిందితులు 1300 మంది.

ఈ నేపథ్యంలో జైల్లో ఖైదీల సంఖ్య పెరిగింది తప్పా అందులోని బారెక్స్ కాదు. ఈ జైల్లో 11 బారెక్స్ లు ఉన్నాయి. వాటిలో మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి నేరం రుజువైన ఖైదీల కోసం, మరొకటి రిమాండ్ ఖైదీలు, మూడో మహిళా ఖైదీల కోసం ఏర్పాటు చేశారు. ఇటీవల ఖైదీల సంఖ్య పెరగడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. బాత్ రూం విషయంలోనూ, వంట సామాగ్రి విషయంలోనూ చాలా అసౌకర్యాలు ఉన్నట్లు సమాచారం.

ఏపీలో అక్రమ గంజాయి రవాణాని నియంత్రించేదుకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తనిఖీలు చేపడుతోంది. ఆ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మంరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మత్తుపదార్థాలను రవాణా చేసే వారు. అందుకు సహకరించేవారు ఇలా అందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు. గంజాయి వ్యవహారంలో ఎన్డీపీఎస్ చట్టాలు చాలా కఠినంగా అమలు జరుగుతాయి.

అందుకే తనిఖీల్లో ఎవరి వద్దనైనా 20 కేజీల కంటే అధికమొత్తంలో గాంజా పట్టుబడితే వెంటనే జ్యుడిషియల్ రిమాండ్ ఉంటుంది. వారికి బెయిల్ దొరకడం కష్టం. దాదాపు ఆరు నెలల దాకా వారికి బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. ఆ తర్వార నేరం రుజువు అయితే దాన్ని బట్టి జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. అందుకే జైల్లో ఖైదీల సంఖ్యం అమాంతం పెరుగుతోందని జైలు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఏపీ గంజాయి తనిఖీల్లో ఎక్కువగా పట్టుబడుతున్న వాళ్లలో అంతర్రాష్ట్ర ముఠాలే ఉండడం గమనార్హం. అసలే గాంజా కేసు... పైగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారికి బెయిల్ దొరకడం గగనంగా మారింది. అందుకే ఆ నిందితులు ఎక్కువ కాలం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ విధంగా విశాఖ జైల్లో ఖైధీల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగి... ఫుల్ రష్ గా మారిన సందర్భాలు ఏర్పడ్డాయి.

ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న వేళ జైల్లో రద్దీ నెలకొంది. అయితే అదనపు బారెక్స్ వెంటనే నిర్మించాలని జైలు అధికారులు కోరుతున్నారు. లేదంటే ఇకపై వచ్చే ఖైదీలను అక్కడ ఉంచుకునే పరిస్థితి లేదని అంటున్నారు. అసలే కరోనా కాలం... ఇలా ఉండాల్సిన సామర్థ్యం కన్నా దాదాపు మూడు రెట్ల మందిని ఉంచితే చాలా ఇబ్బందులు ఎదరవుతున్నాయని చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి... తాత్కాలికంగా ప్రత్యామ్నాయ సదుపాలపైన దృష్టి సారించాలని విశాఖ జైలు అధికారులు కోరుతున్నారు.



Tags:    

Similar News