విశాల్ పై ఆట మొదలైపోయింది

Update: 2017-12-05 04:55 GMT
రాజకీయాల్లోకి వస్తున్నానంటూ కోలీవుడ్ హీరో విశాల్ చేసిన ప్రకటన సెన్సేషన్ అయిపోయింది. ఎలాంటి కన్ ఫ్యూజన్స్ లేకుండా.. స్ట్రెయిట్ గా చెప్పేశాడు ఈ హీరో. అయితే.. రాజకీయాలు అంటే దాడులు- ఎదురుదాడులు సహజమే. సినిమా రంగంలో కూడా ఇలాంటివి ఉన్నా అన్నీ సైలెంటుగా జరిగిపోతాయి. ఒకరిద్దరు తప్ప పెద్దగా బయటపడరు.

కానీ  పాలిటిక్స్ లో అలా కాదు. అన్ని వైపుల నుంచి దాడి చేస్తూ పద్మవ్యూహం మాదిరిగా ఇరికించేస్తుంటారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తానంటూ విశాల్ నుంచి ప్రకటన రాగానే.. ఎదురు దాడులు మొదలైపోయాయి. తమిళ నిర్మాతల సంఘం అధ్యక్ష పదవికి విశాల్ రాజీనామా చేయాలంటూ.. దర్శకనటుడు చేరన్ డిమాండ్ చేస్తున్నాడు. స్పెషల్ గా ప్రెస్ పర్సన్స్ తో మీట్ నిర్వహించి మరీ.. విశాల్ ను ఓ ఆటాడుకున్నాడు. ఏటా 500 కోట్ల రూపాయలతో సినిమాలు తీసే తమిళ నిర్మాతల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న విశాల్.. ముందు ఆ పదవికి రాజీనామా చేయాలని.. 8 నెలల నుంచి ఈ పదవిలో ఉన్నా నిర్మాతలకు మేలు చేసే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నది ఆయన ఆరోపణ.

విశాల్ కారణంగా ఇప్పుడు తమిళ నిర్మాతలు అందరికీ కీడు జరిగే అవకాశం ఉందంటూ ఫ్యూచర్ కూడా అంచనా వేసేశాడు చేరన్. నిర్మాతల సంఘం పదవికి వెంటనే రాజీనామా చేయకపోతే.. నిర్మాతల తరఫున క్రమశిక్షణా చర్యలకు కూడా ఉపక్రమిస్తామని చెప్పడం హైలైట్.
Tags:    

Similar News