బీజేపీకి మ‌రో షాక్‌..టీడీపీ గూటికి చేరేందుకు ఎమ్మెల్యే రెడీ?

Update: 2019-01-31 14:05 GMT
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఊహించ‌ని ఎపిసోడ్‌ తో క‌ల‌క‌లం రేపారు. విష్ణుకుమార్‌ రాజు త్వరలోనే పార్టీ మారుతారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్నే ప్రచారం జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. బీజేపీకి గుడ్‌ బై చెప్పి టీడీపీలో చేరతారనే ప్రచారం సాగుతున్న త‌రుణంలో తాజాగా మ‌రోమారు ఆయ‌న ఈ ప్ర‌చారానికి మ‌ద్ద‌తు ఇచ్చే కామెంట్లు చేశారు. తాజాగా మీడియా ప్రతినిధులతో నిర్వేదంగా మాట్లాడిన విష్ణుకుమార్ రాజు ఈ సంద‌ర్భంగా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీజేపీతో పొత్తుకు ఏ పార్టీనైనా ముందుకు వస్తుందా అని త‌మ పార్టీపై కామెంట్లు చేశారు.

ఫించన్ల పెంపు టీడీపీకి మైలేజ్ ఇచ్చే అంశమ‌ని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఫించన్ల పెంపు - డ్వాక్రా మహిళలకు సాయం వంటి అంశాలతో టీడీపీకి సానుకూలత పెరిగిందని విష్ణుకుమార్ రాజు చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఈ తరహా నిర్ణయాలు తీసుకోకుంటే రాజకీయ పరిస్థితి వేరేగా ఉండేదన్నారు. గతంలో పవన్ పై విమర్శలు చేసే టీడీపీ.. ఇప్పుడు అంతగా విమర్శించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తాననేది నోటిఫికేషన్ వచ్చాకే చెబుతానని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని ఇప్పుడే చెప్పేస్తే.. సరైన కవరేజ్ రాదని కామెంట్ చేశారు.

దేశంలోనే అతి పెద్ద పార్టీ అయిన బీజేపీపై భారీ స్థాయిలో బురద జల్లింది టీడీపీనే అని విష్ణుకుమార్ రాజు కామెంట్ చేశారు. డబ్బులిచ్చినప్పుడు సహజంగానే సానుకూలత వస్తుందని, తమతో  కలిసున్నంత వరకు టీడీపీ పాలన బాగానే ఉందని  అన్నారు. వ్యాఖ్యలు చేశారు. కానీ విడిపోయాక మాత్రం రాజకీయం తప్ప మరేం చేయడం లేదని విష్ణు కుమార్ రాజు విమర్శించారు. లగడపాటి రాజ‌గోపాల్ వ‌లే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తాను చెప్పనని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాగా, ఈ కామెంట్ల నేప‌థ్యంలో విష్ణ‌కుమార్ రాజు బీజేపీకి బైబై చెప్పి టీడీపీలో చేర‌వ‌చ్చ‌ని అంటున్నారు.
Tags:    

Similar News