ఆపరేషన్ ఆకర్ష్ పర్వంలో కొత్త చరిత్రకు ఇదో ఉదాహరణ. కాకాగా పేరుపొందిన కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి తనయులు మాజీ ఎంపీ వివేక్ - మాజీ మంత్రి వినోద్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ ఎస్ లో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతూ వారు అధికారికంగా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా ఇద్దరు సోదరులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి - కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు - సీపీఐ ఎమ్మెల్యే రవీందర్ నాయక్ - కాంగ్రెస్ నేత జువ్వాడి నర్సింగరావు - తన సోదరుడు వివేక్ తో కలసి మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి వినోద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే తమ తండ్రి కల అని, ఆయన కలను సాకారం చేసేందుకే తాను, తన సోదరుడు వివేక్‌తో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని ప్రకటించారు. బంగారు తెలంగాణ కావాలనే తాము టీఆర్ ఎస్ లోకి వస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఎలా చేస్తే అభివృద్ధి చెందుతుందో సీఎం కేసీఆర్ కు తెలుసని అందుకే కేసీఆర్ తో కలిసి అభివృద్ధిలో ముందుకు సాగుతామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం నాన్నకు ఇచ్చిన మాట మేరకు ముందుకు కదులుతామన్నారు.
మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే తాము టీఆర్ ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లోకి తిరిగి వస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ కాంగ్రెస్ లో చేరానని పేర్కొన్నారు. ఇవాళ మళ్లీ తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ ఎస్ లో చేరుతున్నానని వివేక్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్ కు సహకరించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేసీఆర్ కూడా అభివృద్ధి సాధనలో మీరంతా కలిసివస్తే బాగుంటుందని సూచించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము కాంగ్రెస్ లో ఉండి కృషి చేశామన్నారు.